Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత వ్యాపారవేత్త విశాల్ గొండల్ అరుదైన బహుమతిని అందజేశారు. దీపావళి వేడుకల సందర్భంగా ట్రంప్‌కు హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో పఠించే హనుమాన్ చాలీసా ప్రతిని కానుకగా ఇచ్చారు.
తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా కోట్లాది మంది భక్తులకు ధైర్యం, బలం, ఆత్మవిశ్వాసాన్ని అందించే పవిత్ర గ్రంథంగా ప్రసిద్ధి చెందింది. అలాంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన గ్రంథాన్ని అమెరికా అధ్యక్షుడికి అందించడం తనకు ఎంతో గర్వకారణమని విశాల్ గొండల్ పేర్కొన్నారు. ట్రంప్‌తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా బహుమతిగా ఇవ్వడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనను కూడా వివరించారు.

భారత్ - అమెరికా స్నేహం బలోపేతం కావాలని ఆకాంక్ష
హనుమాన్ చాలీసా కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదని, ధైర్యం, బలం, శక్తికి ప్రతీకగా కోట్లాది మంది విశ్వసిస్తారని విశాల్ గొండల్ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర గ్రంథాన్ని ట్రంప్‌కు అందించడం తనకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందన్నారు. అంతేకాకుండా భారత్, అమెరికా దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగ అందించే చీకటిపై వెలుగు విజయ సందేశం ప్రపంచమంతటా విస్తరించాలని, ఇరు దేశాల మధ్య స్నేహం, సహకారం నిరంతరం కొనసాగాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు అంతర్జాతీయ వేదికపై లభిస్తున్న గుర్తింపునకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది.
ఆన్‌లైన్ ఉగ్రవాద నియామకాల కేసులో పోలీసుల దాడులు.. కశ్మీర్‌లో ఆరు ప్రాంతాల్లో సోదాలు!

