Dailyhunt
ట్రంప్ పై 25వ సవరణ చర్చ ..అందరి చూపులు జె.డి. వాన్స్ పైనే..

ట్రంప్ పై 25వ సవరణ చర్చ ..అందరి చూపులు జె.డి. వాన్స్ పైనే..

వార్త 2 weeks ago

మెరికా రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న అత్యంత ఉత్కంఠభరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఇరాన్ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు స్వదేశంలోనే పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

ముఖ్యంగా ట్రంప్ మానసిక స్థితిపై అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్ పార్టీలోని కొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, రాజ్యాంగంలోని 25వ సవరణ’ (25th Amendment)ను ప్రయోగించి ఆయనను పదవి నుండి తొలగించాలనే చర్చను తెరపైకి తెచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ పాత్ర ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఇరాన్‌పై యుద్ధం ప్రకటించడం, పవర్ ప్లాంట్లు, వంతెనలను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించడం వంటి చర్యలు అమెరికాను ప్రమాదంలోకి నెడుతున్నాయని విమర్శకులు భావిస్తున్నారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్‌’లో వాడిన భాష, గడువు ముగిస్తే “నరకం చూపిస్తా” అని చేసిన వ్యాఖ్యలు ఆయన పరిణతిపై ప్రశ్నలు లేవనెత్తాయి.

Read Also: Air India: భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత

 Iran-USA War

Iran-USA War: పదవి నుండి తప్పించే అధికారం 25వ సవరణ

ఈ నేపథ్యంలోనే, అధ్యక్షుడు తన బాధ్యతలను నిర్వర్తించడానికి తగిన మానసిక స్థితిలో లేరని భావిస్తే, ఉపాధ్యక్షుడు, మంత్రిమండలి మెజారిటీ సభ్యులు కలిసి ఆయనను పదవి నుండి తప్పించే అధికారం 25వ సవరణ కల్పిస్తుంది. అయితే, జె.డి. వాన్స్ ఈ ప్రతిపాదనలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా ప్రయోజనాల కోసమేనని, హార్ముజ్ జలసంధిని తెరిపించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రక్షించడమే తమ లక్ష్యమని ఆయన సమర్థిస్తున్నారు. విపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. మరోవైపు, ఇరాన్ నావికాదళం, రాజకీయ నాయకులు ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ.. అమెరికాను “ఊబిలోకి” లాగుతున్నారని హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. పిచ్చి బాస్టర్డ్స్‌ అంటూ ఇరాన్ మీద విరుచుకుపడిన ట్రంప్.. హార్మూజ్ జలసంధిపై తగ్గేదేలే అంటున్న ఇరాన్.. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఇప్పటికే భారీగా యుద్ధ విమానాలను, డ్రోన్లను కోల్పోయిందన్న వార్తలు వస్తున్న తరుణంలో.. అమెరికా కాంగ్రెస్‌లో కూడా ఆందోళన మొదలైంది. యుద్ధం వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలను అంచనా వేస్తూ, ట్రంప్ తన వ్యక్తిగత పంతం కోసం దేశాన్ని యుద్ధంలోకి నెడుతున్నారా? అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. 25వ సవరణను ప్రయోగించడం అనేది అమెరికా చరిత్రలో అత్యంత అరుదైన, కఠినమైన ప్రక్రియ. దీనికి ఉపాధ్యక్షుడి మద్దతు తప్పనిసరి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ట్రంప్ కు పదవి గండం ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha