Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్రంప్ విందులో కాల్పుల కలకలం.. అక్కడే ఉన్నానన్న కేఏ పాల్

ట్రంప్ విందులో కాల్పుల కలకలం.. అక్కడే ఉన్నానన్న కేఏ పాల్

వార్త 1 month ago

KA Paul: వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్ఠాత్మక హిల్టన్ హోటల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొన్న విందులో కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Read Also: Iran Crisis : బియ్యం, గుడ్లు కూడా కొనలేని పరిస్థితి.. ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం

KA Paul: నేను అక్కడే ఉన్నాను: కేఏ పాల్

వాషింగ్టన్ డీసీలోని ప్రఖ్యాత హిల్టన్ హోటల్‌లో ‘మీడియా రిపోర్టర్స్ కరస్పాండెంట్స్’ వార్షిక విందు జరుగుతుండగా కాల్పులు జరిగాయి.. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు.గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 5 నుండి 6 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినబడటంతో విందులో ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది తక్షణమే స్పందించి ట్రంప్ మరియు వాన్స్‌లను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

 Firing at Donald Trump Dinner

ఈ ఘటనపై గ్లోబల్ పీస్ అంబాసిడర్ డాక్టర్ కేఏ పాల్ స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. తాను ఆ సమయంలో అదే హోటల్‌లో ఉన్నట్లు ఆయన ధృవీకరించారు. తాను ఎప్పుడు అమెరికా వచ్చిన ఇదే హోటల్‌లో ఉంటానని చెప్పారు. తన జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని చూడలేదన్నారు. యుద్ధాల వల్లే ఈ పరిస్థితి తెలెత్తిందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటన్నారు. యుద్ధం ముగించి శాంతి కోసం పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు.

పెను ప్రమాదం తప్పింది

అమెరికా అధ్యక్షుడి భద్రతా విభాగం (Secret Service) చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా లేదా అనే దానిపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై అమెరికా పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఎటాక్ పై ట్రంప్ రియాక్షన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha