Dailyhunt
ట్రంప్పై దాడి ప్రజాగ్రహానికి నిదర్శనమా?

ట్రంప్పై దాడి ప్రజాగ్రహానికి నిదర్శనమా?

వార్త 1 week ago

Attack on Trump : ప్రపంచమంతా ఇంధన సంక్షో భంతో కకావికలమవుతూ, అమెరికాను తిట్టిపోసుకుంటున్న తరుణంలో వైట్ హౌస్ వార్తలను బాహ్య ప్రపంచానికి తెలియచేసే ప్రెస్కర స్పాండెంట్స్ అసోసియేషన్ విందు సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరగడం, ట్రంప్తో పాటు ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఇతర అతిథులు తృటిలో తప్పించుకోవడం సంచలన వార్తగా మారింది.

డోనాల్డ్ ట్రంప్పై హత్యా ప్రయత్నం జరగడం ఇదేమీ మొదటి సారికాదు. గతంలో లాస్ వెగాస్, పెన్సిల్వే నియాల్లో కూడా ట్రంప్పై కాల్పులు జరిగాయి. 2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ కుడి చెవికి బుల్లెట్ గాయం తగిలినా సురక్షితంగా బయట పడిన విష యం విదితమే. శతృ దుర్భేద్యమైన భద్రతా వలయాన్నిచేధిం చుకుని ఒక అతిథిలా కాలిఫోర్నియాకు చెందిన ఒక యువ ఉపాధ్యాయుడు ఆయుధాలతో ప్రవేశించడం అమెరికా భద్ర తా వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది. తాజాగా జరిగిన దాడిని వివిధ కోణాల్లో విశ్లేషించవలసి ఉంటుంది. ఈ దాడి వెనుక ప్రధాన ఉద్దేశ్యమేమిటి? ట్రంప్ తన చేష్ట లతో, యుద్ధోన్మాదంతో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తు న్నాడన్న ఆగ్రహంతో ఈదాడి జరిగిందా?

Read Also : Iran US Conflict : అణు చర్చలే అడ్డంకి… ఇరాన్-అమెరికా తగాదా

 Attack on Trump

Attack on Trump : మానసిక రోగి

అమెరికా ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేస్తున్నందుకా? ఇరాన్ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుని ఇంధన కొరతను సృష్టించి ప్రపంచ దేశాలకు కంటక ప్రాయంగా మారినందుకా? ఇలాంటి ఎన్నో సందేహాలు విశ్లేషకుల ఆలోచనలకు పదును పెడుతున్నాయి. ట్రంప్పై జరిగిన దాడిపట్ల ఎవరూ మన స్ఫూర్తిగా తమ సానుభూతిని వ్యక్తం చేయలేదు. కొన్ని దేశాలు ఈదాడిని ఖండించినా అది ఆయా దేశాల నుండి మన స్ఫూర్తిగా వెలువడిన ప్రకటనలు కావని అందరికీ తెలుసు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని మానసిక రోగిగా ట్రంప్ పేర్కొనడం విడ్డూరం. వాస్తవంగా చెప్పాలంటే ట్రంప్ నిజమైన మానసిక రోగ గ్రస్తుడుగాను, యుద్ధోన్మాదిగాను, అహంభావిగాను అమెరికాతోపాటు యావత్ ప్రపంచం భావిస్తున్నది. అయినప్పటికీ ట్రంప్ తన పిచ్చి చేష్టలతో తమపై ఏరూపంలో విరుచుకుపడతాడోనన్న భయంతో కొన్ని దేశాలు సంయమనం పాటిస్తున్నాయి. వీసాల విష యంలోను, టారిఫ్ల అంశంలోను తలనొప్పిగా పరిణమిం చిన ట్రంప్ నిర్ణయాలు అనుచితంగా ఉన్నాయి. మిత్ర దేశాలను సైతం వదలకుండా చులకనగా చూసిన ట్రంప్ వైఖరి వలన అమెరికా నేడు ఏకాకిగా మారింది. భారత్ను ఎన్నో సార్లు ట్రంప్ అత్యంత దారుణంగా అవమానించాడు. కనీస నియమ నిబంధనలు పాటించకుండా, అక్రమ వలస దారులంటూ అమెరికాలో ఉంటున్న భారతీయులకు సంకెళ్ళు వేసి యుద్ధ విమానాల్లో భారత్కు పంపించి, అమర్యాదగా ప్రవర్తించాడు.

ప్రజలు ఆగ్రహం

అమెరికా రేడియో వ్యాఖ్యాత మైఖేల్ సావెజ్ భారత్, చైనాలను నరక కూపాలుగా, భారతీయ ఉద్యోగులను ల్యాప్ట్యాప్ లు ధరించిన గ్యాంగ్ స్టర్లుగా అభివర్ణిస్తూ అను చిత వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను ట్రంప్ తన ట్రూత్ సోషల్లో రీ ట్వీట్చేస్తూ, తన అభిప్రాయం కూడా అదేన న్నట్టుగా అక్కసు వెళ్ళగక్కడం అభ్యంతరకరం. గర్భం దాల్చి న మహిళలు అమెరికాలో అడుగు పెట్టి, పిల్లలను కని అమెరికాలో శాశ్వతంగా తిష్టవేయడానికి ప్రయత్నిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం. అమెరికా ఎంతగా అవమానించి నా, నిందిం చినా భారత ప్రభుత్వం ఇప్పటి వరకు సరైన రీతిలోస్పందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అమెరికా స్థూల జాతీయోత్పత్తిలో గణనీయమైన పాత్ర వహిస్తూ, కీలకమైన తన భారతీ యుల శ్రమను, నైపుణ్యాన్ని వినియోగించుకుంటూ, వారిని అవమానించడం కుసంస్కారం. ఇప్పటికే గ్రీన్ కార్డులపై భారతీయుల ఆశలు సన్నగిల్లాయి. హెచ్1బి వీసాల సంఖ్య ను 25వేలకు కుదించిన నేపథ్యంలో మూడేళ్ల పాటు హెచ్ 1బి వీసాలను కూడా నిరాకరించాలని యు.ఎస్ కాంగ్రెస్ ముందుకు మరో బిల్లు రాబోతున్నది. ఇలాంటి నిర్బంధాల మధ్య ఇక భారతీయ సాఫ్ట్వేర్ నిపుణుల అమెరికా ప్రవేశం అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికే అమెరికాలో స్థిరప డాలని కలలు గన్న భారతీయుల ఆశలు ఆవిరైపోయాయి. చాలా మంది భారతీయులు అమెరికాలో పనిచేయడానికి విముఖత ప్రదర్శిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

దేశాలకు నమ్మకం పోయింది

అమెరికా పట్ల ప్రపంచ దేశాలకు నమ్మకం పోయింది. పాక్ తో ట్రంప్ స్నేహం భారత్కు తలనొప్పి తెచ్చే వ్యవహారమే. పాక్ ఉగ్రవాదుల మూక పహల్గాంలో నరమేథం సాగించిన తర్వాత భారత్ ఎంతో సాహసంతో ఆపరేషన్ సిందూర్ పాక్లోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడమే కా కుండా, ఉగ్రవాదులను క్షణాల్లో మట్టుబెట్టి శభాష్ అనిపిం చుకుంది. భారత్ చర్యతో బెంబేలెత్తిన పాక్ భారత్ను శరణుజొచ్చి, కాల్పుల విరమణకు అంగీకరింప చేసింది. అప్పుడే అమెరికా ఈ సన్నివేశంలోకి ట్రంప్ హఠాత్తుగా ప్రవేశిం చి తానే భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని నిలువరించానని, ఇరుదేశాల మధ్య అణుయుద్ధం రాకుండా ఆపగలిగానని ఉత్తర
కుమార ప్రగల్భాలు పలుకుతూ, నేటివరకు అనేక విషయా ల్లో భారత్ను నొప్పిస్తూ, అవమానిస్తూ సంతృప్తి పొందుతు న్నాడు. అమెరికా తన శక్తి యుక్తులన్నీ కూడదీసుకుని అత్యంత శక్తివంతమైన క్షిపణులను ఇరాన్పై ప్రయోగించినా, అమెరికా ఆయుధ సంపత్తి ఇరాన్ డ్రోన్ల ముందు తునాతునకలు కావడం, ఇరాన్ క్షిపణుల దాటికి అమెరికా యుద్ధ విమానాలు విధ్వంసం కావడం అమెరికా ఆయు ధాలు కొంటున్న దేశాలను ఆలోచింప చేస్తున్నాయి. ట్రంప్ వైఖరి వలనే హార్ముజ్జలసంధివద్ద భారత్ సహా పలు దేశాల చమురు నౌకలు నిలిచిపోయాయి. ఇరాన్ నౌకాశ్ర యాలను దిగ్బంధనం చేయడంవలనే ఇరాన్ హార్ము జ్పై తన పట్టును మరింత బిగించింది. ఈకారణంగానే భారత్తో సహాపలు ప్రపంచ దేశాలు తీవ్రమైన చమురు, గ్యాస్ సంక్షో భాన్ని ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ దురహం కారం ప్రపంచ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. కాల్పుల విరమణ ప్రకటించినా ట్రంప్ అందుకు కట్టు బడక పోవడంతో, ట్రంప్పై ఇరాన్ తన నమ్మకాన్ని కోల్పోయింది.

 Attack on Trump

‘నో కింగ్స్’

ఒక వైపు చర్చలంటూనే మరోవైపు ఇరాన్ నౌకాశ్రయాలను దిగ్బంధనం చేయడం వలన ఇరాన్ అమెరికాతో ప్రత్యక్ష చర్చలను నిలుపుదల చేసింది. ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధాన్ని ఆపగల సామర్ధ్యమున్నా భారత్ మాత్రం మౌన ముద్రహించడంలో గల ఔచిత్యం అవగతం కావడం లేదు. ఇటీవల ట్రంప్పై జరిగిన దాడి పట్ల అతిగా స్పందించవల సిన అవసరం లేదు. ఈ సంఘటన ట్రంప్పై ప్రతీకారం తో జరిగిందా? లేక అమెరికా ప్రజల్లో సానుభూతి కోసం జరిపించుకున్న నాటకమా? అనే విషయం తేలాలి. ఇప్పటికే అధ్యక్షుడి తీరుతో అమెరికా ప్రజలు విసుగెత్తిపోయారు. ‘నో కింగ్స్’ అంటూ లక్షలాది మంది ప్రజలు రోడ్లెక్కి నిర సన తెలిపారు. ఇరాన్ పై జరుపుతున్న యుద్ధంలో ఘోర వైఫ ల్యం చెందిన ట్రంప్ ప్రజలను తప్పు దారి పట్టించ డానికి ఈ డ్రామా ఆడినట్టు పలువురు భావిస్తున్నారు. తనపై జరిగిన దాడిని అమెరికా రాజ్యాంగం పై జరిగిన దాడిగా ట్రంప్ పేర్కొనడం విడ్డూరం. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యముసుగులో నియంతృత్వం చెలాయిస్తున్న ట్రంప్ కు ఇలాంటి వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు లేదు. ఏది ఏమైనప్పటికీ ఇకనైనా భారత్ మేల్కొ నాలి. అమెరికా పట్ల జాగరూకత వహించాలి. నమ్మకమైన రష్యాను భారత్ వదులుకోకూడదు.

-సుంకపల్లి సత్తిరాజు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఇరాన్ ప్రతిపాదనలు - అమెరికా తిరస్కరణ: కొనసాగుతున్న ప్రతిష్టంభన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha