Trisha Political Entry : దక్షిణాది ప్రముఖ నటి త్రిష కృష్ణన్ రాజకీయ ప్రవేశంపై తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. స్టార్ హీరో విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీలో త్రిష చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు కోలీవుడ్ నుంచి పొలిటికల్ వర్గాల వరకు హాట్ టాపిక్‌గా మారాయి.
విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా రాజీనామా చేసిన తిరుచ్చి నియోజకవర్గం నుంచే త్రిష ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందంటూ ప్రచారం జోరందుకుంది. తాజాగా మదురై నగరంలో ‘త్రిష నర్పణి మండ్రం’ (త్రిష సేవా సంఘం) పేరుతో వెలిసిన “రాజకీయాల్లోకి స్వాగతం” పోస్టర్లు ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చాయి. అయితే ఈ అంశంపై నటి త్రిష ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.

రాజకీయ విమర్శల సుడిగుండంలో నటి: ప్రత్యర్థుల లక్ష్యంగా మారిన త్రిష
మరోవైపు, అధికార డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సహా ఇతర రాజకీయ ప్రత్యర్థులు విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించే క్రమంలో త్రిష పేరును కూడా ఇందులో లాగుతుండటంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ, ఆయన వ్యక్తిగత-రాజకీయ నిర్ణయాల చుట్టూ తిరిగే వివాదాల్లో త్రిష పేరును పదే పదే ప్రస్తావిస్తుండటంతో ఆమె పేరు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మార్మోగుతోంది. ఏది ఏమైనప్పటికీ, ఒకవైపు అభిమానుల పోస్టర్ల హంగామా, మరోవైపు ప్రత్యర్థి పార్టీల వ్యూహాత్మక విమర్శలతో త్రిష పొలిటికల్ ఎంట్రీ అంశం కోలీవుడ్ వ్యాప్తంగా మరియు తమిళ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారితీస్తోంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవిస్తే శిశువుకు 1 గ్రాము బంగారు ఉంగరం.. తమిళనాడు ప్రభుత్వం

