Trisha Tirumala Visit: నటి త్రిష తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అయితే, ఇదే సమయంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండటం, అందులో నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీ అంచనాలకు మించి రాణిస్తుండటంతో నెటిజన్లు త్రిష పర్యటనను రాజకీయాలతో ముడిపెడుతున్నారు.
Trisha Tirumala Visit: బండ్ల గణేష్ ట్వీట్ హైలైట్
ఈ నేపథ్యంలో,నిర్మాత బండ్ల గణేష్ చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. పుట్టినరోజు సందర్భంగా నటి త్రిష తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న నేపథ్యంలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు. "శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ కలలు నెరవేరాయి" అంటూ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యను కొందరు నెటిజన్లు తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో TVK గెలుపుతో అనుసంధానిస్తూ వ్యాఖ్యానిస్తున్నారు. విజయ్ గెలుపు కోసమే త్రిష తిరుపతి వెళ్లారని అంటున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

