Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్రిష వల్లే విజయ్‌కు దరిద్రం అంటున్న వేణుస్వామి.. ఎందుకు?

త్రిష వల్లే విజయ్‌కు దరిద్రం అంటున్న వేణుస్వామి.. ఎందుకు?

వార్త 3 months ago

Venu Swamy: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీతో ప్రభంజనం సృష్టించిన దళపతి విజయ్ గురించి వేణుస్వామి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

విజయ్ సాధించిన విజయానికి, నటి త్రిష జాతకానికి మధ్య విడదీయలేని సంబంధం ఉందని ఆయన పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Read Also : Bihar: వాహనాలపై కులాల పేర్లు ఉంటే జరిమానా

 Trisha is the reason for Vijay’s poverty.. Venuswamy’s sensational horoscope!

Venu Swamy: వేణుస్వామి షాకింగ్ విశ్లేషణ!

వేణుస్వామి విశ్లేషణ ప్రకారం, విజయ్ , త్రిషల జాతకాలు ‘ఏకనాడి’ కాంబినేషన్‌కు చెందినవి. జ్యోతిష్య శాస్త్రంలో ఏకనాడి అనేది చాలా శక్తివంతమైనది, అదే సమయంలో ప్రమాదకరమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ అఖండ మెజారిటీ సాధించడానికి త్రిష గ్రహస్థితులే ప్రధాన కారణమని, ఆమె ప్రభావం లేకపోతే విజయ్ రాజకీయ జర్నీ మరోలా ఉండేదని వేణుస్వామి కుండబద్దలు కొట్టారు.

అయితే, ఈ కాంబినేషన్ వల్ల కేవలం విజయాలు మాత్రమే రావని, అంతే స్థాయిలో ఇబ్బందులు కూడా ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. “విజయ్ సీఎం పీఠం ఎక్కినప్పటికీ, అది ఎక్కువ కాలం నిలవదు” అని వేణుస్వామి జోస్యం చెప్పారు. త్రిష జాతక ప్రభావం వల్ల కలిగిన ఈ రాజకీయ యోగం, భవిష్యత్తులో అస్థిరతకు దారితీస్తుందని, అందుకే దీనిని ఒక రకమైన ‘దరిద్రం’గా ఆయన అభివర్ణించారు.

6 నెలల్లోనే ప్రభుత్వం కూలిపోతుందా?

గురు గ్రహ మార్పుల వల్ల తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని, విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం ఆరు నెలల నుంచి ఏడాది లోపే కుప్పకూలే అవకాశం ఉందని ఆయన సంచలన బాంబు పేల్చారు. గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల రాష్ట్రంలో మళ్లీ మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

భారత్‌లోనే తొలి స్పేస్-టెక్ యూనికార్న్‌గా స్కైరూట్ సంచలనం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha