Kalvakuntla Kavitha: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ పరిసరాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రులతో చర్చల నిమిత్తం శాంతియుతంగా నిరసన తెలపడానికి సిద్ధమైన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ అరెస్ట్ జరిగినట్లు పోలీసులు చెబుతుండగా, ఈ పరిణామంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల ధ్వజం
కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను మరియు ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తోందని వారు మండిపడ్డారు.
“తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కనబెట్టి, అరాచక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. ఉద్యమకారుల గొంతు నొక్కాలని చూస్తే ఈ ప్రభుత్వానికి పతనం తప్పదు.”
ప్రస్తుతం కవిత అరెస్టుతో హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

