Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తుకారాం ముండేకు అంతర్జాతీయ గుర్తింపు.. న్యూయార్క్ టైమ్స్ ప్రశంసలు

తుకారాం ముండేకు అంతర్జాతీయ గుర్తింపు.. న్యూయార్క్ టైమ్స్ ప్రశంసలు

వార్త 2 weeks ago

Acclaim from The New York Times : మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, ఐఏఎస్ అధికారి తుకారాం ముండే చేపడుతున్న ఆహార భద్రత తనిఖీలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి.

రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ స్టోర్లలో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకుంటున్న ఆయనను ది న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో 'రాక్‌స్టార్‌', 'ఫుడ్ సేఫ్టీ సెలబ్రిటీ'గా అభివర్ణించింది. తుకారాం ముండే ఆకస్మిక తనిఖీలకు వెళ్లడం రెస్టారెంట్, హోటల్ యజమానుల్లో భయాన్ని కలిగిస్తుండగా, వినియోగదారుల నుంచి మాత్రం ప్రశంసలు వస్తున్నాయి. ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం విషయంలో రాజీపడకుండా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. దీంతో ఆయనకు 'ఐఏఎస్ సింగం' అనే పేరు కూడా వచ్చింది.

SIR : ఓటర్ల తొలగింపునకు భారీగా 'ఫారం-7' దరఖాస్తులు.. చర్యలకు తెలంగాణ ఎన్నికల అధికారి ఆదేశం

 Acclaim from The New York Times

Acclaim from The New York Times : ప్రముఖ ఫుడ్ బ్రాండ్లపై చర్యలు

తనిఖీల సమయంలో కొన్ని ఔట్‌లెట్లలో కిచెన్‌లలో బొద్దింకలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో డొమినోస్, పిజ్జా హట్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన కొన్ని ఔట్‌లెట్లపై తాత్కాలిక మూసివేత వంటి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఫుడ్ సేఫ్టీ తనిఖీలు సంప్రదాయ రెస్టారెంట్లకే పరిమితం కాలేదు. బ్లింకిట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ సంస్థల డార్క్ స్టోర్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ పారిశుద్ధ్య లోపాలు, బొద్దింకలు, బల్లులు, గడువు ముగిసిన ఆహార పదార్థాలకు సంబంధించిన ఉల్లంఘనలు గుర్తించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. మహారాష్ట్రలో ఈ ఏడాది మే నుంచి తుకారాం ముండే నేతృత్వంలోని ఎఫ్‌డీఏ విభాగం పారిశుద్ధ్య లోపాలు, కల్తీ, ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనలపై విస్తృత తనిఖీలు, దాడులు నిర్వహిస్తోంది. ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా నిబంధనలను కఠినంగా అమలు చేయడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Epaper:epaper.vaartha.com

పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha