Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలో అందుబాటులోకి కొత్త ప్రపంచ పటం..ఐరాస కీలక నిర్ణయం!

త్వరలో అందుబాటులోకి కొత్త ప్రపంచ పటం..ఐరాస కీలక నిర్ణయం!

వార్త 2 weeks ago

New World Map: ప్రపంచ దేశాలు ఇప్పటివరకు ఉపయోగిస్తున్న భౌగోళిక పటంలో ఆయా ఖండాల అసలు విస్తీర్ణాన్ని సరిగ్గా చూపేలా కొత్త ప్రపంచ పటాన్ని (New World Map) రూపొందించేందుకు ఐక్యరాజ్యసమితి (UN General Assembly) ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది.

టోగో దేశం ప్రవేశపెట్టిన 'కరెక్ట్ ద మ్యాప్' (Correct the Map) అనే ఈ తీర్మానానికి ఐక్యరాజ్యసమితిలోని 164 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, భారతదేశం కూడా దీనికి పూర్తి మద్దతు తెలిపింది. అయితే, ఈ తీర్మానాన్ని ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశమైన అమెరికా (USA) ఒక్కటే తీవ్రంగా వ్యతిరేకించగా, ఉక్రెయిన్, ఈస్టోనియా సహా ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

Read Also :Kenya's President : తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు

New World Map: మెర్కేటర్ మ్యాప్ లోపాలు, మార్పులు & ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ ముఖ్యాంశాలు

ప్రస్తుతం పాఠశాలలు, మీడియా, డిజిటల్ నెవిగేషన్‌లో వాడుతున్న మ్యాప్‌ను 1569లో గెరార్డస్ మెర్కేటర్ రూపొందించారు. భూమధ్యరేఖకు దూరంగా ఉన్న ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని దేశాల పరిమాణాన్ని ఇది అసలు సైజు కంటే చాలా పెద్దదిగా చూపిస్తుంది. మెర్కేటర్ మ్యాప్‌లో 'గ్రీన్‌లాండ్' ఆఫ్రికా ఖండం కంటే పెద్దదిగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆఫ్రికా ఖండం ગ్రీన్‌లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. కొత్తగా తీసుకురానున్న 'ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్' (Equal Earth Projection) ఆధారిత మ్యాప్‌తో ఆఫ్రికా, దక్షిణ అమెరికా, దక్షిణాసియా భూభాగాల అసలు విస్తీర్ణంపై ప్రపంచానికి స్పష్టత రానుంది. ఐరాసలో భారత ప్రతినిధి రఘూ పురి మాట్లాడుతూ.. కచ్చితత్వంతో కూడిన భూగోళ పటాన్ని రూపొందించేందుకు ఈ తీర్మానం దోహదపడుతుందని, 'ఈక్వల్ మ్యాప్ ఏరియా ప్రొజెక్షన్'కు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ తీర్మానం వెనుక 'సైద్ధాంతిక కుట్ర' ఉందంటూ అమెరికా వ్యతిరేకంగా ఓటేసింది. మరోవైపు కొత్త ఈక్వల్ ఎర్త్ మ్యాప్ రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ ప్రాంతాలను రష్యాలో ఉన్నట్లే చూపుతోందన్న నెపంతో ఉక్రెయిన్ ఓటింగ్‌ను బహిష్కరించింది. ఈ తీర్మానం పాత మెర్కేటర్ మ్యాప్‌ను పూర్తిగా నిషేధించదని, కేవలం ఖండాల అసలు వైశాల్యాలను సమానంగా చూపించేలా 'ఈక్వల్ ఏరియా మ్యాప్‌ల' వాడకాన్ని ప్రోత్సహిస్తుందని యూరోపియన్ యూనియన్ (EU) స్పష్టం చేసింది. దీనివల్ల ఏ దేశ భౌగోళిక బోర్డర్లు మారవని పేర్కొంది.

అమెరికా లో విషాదం.. అనంతపురం జిల్లాకు చెందిన యువకుడు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha