India first bullet train: భారతదేశ రవాణా రంగంలో దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది (2027) ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ హైస్పీడ్ బుల్లెట్ రైలు పట్టాలపై పరుగులు తీయనుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ముంబై – అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్‌లో ఈ తొలి బుల్లెట్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సురక్షితమైనదిగా పేరుగాంచిన జపాన్ దేశపు 'షింకన్సెస్' సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈ మెగా ప్రాజెక్ట్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి.
First bullet train to hit the tracks soon… Railway Minister’s announcement!
India first bullet train: రూట్ మ్యాప్.. ప్రయాణించే స్టేషన్లు ఇవే!
ఈ హైస్పీడ్ రైలు మార్గంలో ప్రయాణికులకు సేవలందించేందుకు మొత్తం 12 స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారిడార్ ద్వారా ముంబై, అహ్మదాబాద్ నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం మన దేశీయ రక్షణ, రవాణా రంగ సంస్థ అయిన బీఈఎంఎల్ (BEML) సరికొత్త సాంకేతికతతో రైళ్లను తయారు చేస్తోంది. ట్రైన్ మోడల్ మేడ్ ఇన్ ఇండియా నినాదంతో బీ28 రైలు సెట్‌ను బీఈఎంఎల్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, ప్రయాణికుల రక్షణ, సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ ఈ కోచ్‌లను డిజైన్ చేస్తున్నారు.
వచ్చే ఏడాది ఆగస్టులో ఈ మార్గంలో తొలి విడత సర్వీసులు ప్రారంభం కానున్నప్పటికీ.. ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌కు సంబంధించిన పూర్తి స్థాయి లైన్ పనులు, అన్ని రకాల అనుబంధ మౌలిక వసతుల నిర్మాణం 2029 నాటికి వంద శాతం పూర్తికానుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే భారత రైల్వే ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఓపెన్‌డోర్ కార్యకలాపాలు మూసివేత.. 250 మంది ఉద్యోగులకు ఉద్వాసన!

