1000 Rupee Note News: దేశంలో త్వరలో మళ్లీ రూ.1,000 నోట్లు చలామణిలోకి రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పసుపు రంగులో ఉన్న కొత్త రూ.1,000 నోటు చిత్రాలను షేర్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ నోటును విడుదల చేయబోతోందని పలువురు పోస్టులు పెడుతున్నారు.
కొందరు నోటు విడుదల తేదీపై కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూ.1,000 నోటు విడుదలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని ప్రజలకు సూచించింది. సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్‌లలో కొత్త రూ.1,000 నోటుకు సంబంధించిన చిత్రాలు, పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాల్లో పసుపు రంగులో ఉన్న నోటును చూపిస్తూ, త్వరలోనే కొత్త కరెన్సీ నోటు అందుబాటులోకి రాబోతోందని ప్రచారం చేస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న చిత్రాలు, వాటితో పాటు వస్తున్న సమాచారాన్ని అధికారికంగా ధ్రువీకరించే ప్రకటన ఏదీ లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. కొత్త రూ.1,000 నోటును విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించలేదని స్పష్టం చేసింది. కరెన్సీ నోట్ల రూపకల్పన, విడుదల, చలామణికి సంబంధించిన నిర్ణయాలు అధికారికంగా ప్రకటించినప్పుడే వాటిని విశ్వసించాలని సూచించింది. కేవలం నోటు ఫొటోలు, సోషల్ మీడియా పోస్టులు లేదా నిర్ధారణ లేని తేదీల ఆధారంగా నిజమని భావించకూడదు.
Rahul Gandhi: మోదీ, అమిత్ షాలపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు!
1000 Rupee Note News
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏం జరిగింది?
2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించింది. అప్పటివరకు చలామణిలో ఉన్న పాత రూ.500, రూ.1,000 నోట్లను చట్టబద్ధ చెలామణి నుంచి ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేయడం లేదా నిబంధనల ప్రకారం మార్చుకోవడం కోసం క్యూలలో నిలబడాల్సి వచ్చింది. నగదు లావాదేవీలపై ఆధారపడే వ్యాపారులు, సామాన్య ప్రజలు కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టారు. కొత్త రూ.500 నోటుతో పాటు రూ.2,000 నోటును కూడా చలామణిలోకి తీసుకొచ్చారు. అనంతరం రూ.200, ఇతర విలువల నోట్ల వినియోగం కూడా కొనసాగింది. అయితే పాత రూ.1,000 నోటు స్థానంలో కొత్త రూ.1,000 నోటును తిరిగి ప్రవేశపెట్టలేదు. అప్పటి నుంచి ఈ నోటును మళ్లీ తీసుకొస్తారనే వార్తలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్నాయి.
Epaper: epaper.vaartha.com
రైళ్లలో రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు మొబైల్ ఛార్జింగ్‌పై ఆంక్షలు

