Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలో రూ.1,000 నోటు రాబోతోందా? కేంద్రం కీలక క్లారిటీ

త్వరలో రూ.1,000 నోటు రాబోతోందా? కేంద్రం కీలక క్లారిటీ

వార్త 3 weeks ago

PIB: భారతదేశంలో త్వరలోనే మళ్లీ రూ.1,000 నోట్లు రాబోతున్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్, 'ఎక్స్' (ట్విట్టర్) వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో కొత్త వెయ్యి రూపాయల నోటుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

దీంతో సాధారణ ప్రజల్లో అయోమయం నెలకొంది.

వార్తలను ఖండించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB)

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పుకార్లపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫాక్ట్ చెక్ విభాగం తీవ్రంగా స్పందించింది. రూ.1,000 నోటు మళ్లీ వస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఆ నోట్ల ఫొటోలు పూర్తిగా నకిలీవని తేల్చి చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అలాంటి ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని తీసుకోలేదని స్పష్టం చేసింది.

PIB: ప్రజలకు అధికారుల హెచ్చరికలు మరియు నోట్ల రద్దు జ్ఞాపకాలు

2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) తర్వాత ప్రభుత్వం గానీ, ఆర్బీఐ గానీ ఇప్పటివరకు రూ.1,000 నోటును ఎక్కడా పునరుద్ధరించలేదని అధికారులు గుర్తుచేశారు. సోషల్ మీడియాలో వచ్చే నిరాధారమైన వదంతులను, ఫేక్ వార్తలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలను షేర్ చేయవద్దని హెచ్చరించారు.

ఆపన్నహస్తం అందించాల్సిన తరుణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha