Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలోనే 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

త్వరలోనే 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

వార్త 1 month ago

16th Finance Commission Funds: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు విడుదల కావాల్సిన 16వ ఆర్థిక సంఘం (16th Finance Commission) నిధులను త్వరలోనే నేరుగా విడుదల చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

ఈ మేరకు నిధుల నిర్వహణ మరియు వినియోగానికి సంబంధించి కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రత్యేకాధికారుల పేరుతో నూతన బ్యాంక్ ఖాతాలు

ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసిన నేపథ్యంలో, పంచాయతీ ప్రత్యేకాధికారుల (Special Officers) పేరిట జాతీయ బ్యాంకుల్లో తక్షణమే ప్రత్యేక ఖాతాలను తెరవాలని కేంద్రం ఆదేశించింది. ఈ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేసే బాధ్యతను జిల్లా పంచాయతీ అధికారులు (DLPO), మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (MPDO)లకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో ఖాతాల వివరాలను సేకరించి నిధుల బదిలీకి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

16th Finance Commission Funds: నిధుల కేటాయింపు - వ్యయ ప్రణాళిక

గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతమే లక్ష్యంగా ఈ నిధులను ఖర్చు చేయాలని కేంద్రం నిబంధనలు విధించింది. ఇందులో

  • 40 శాతం నిధులు: పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు వినియోగించాలి.
  • 40 శాతం నిధులు: గ్రామీణ రహదారుల మరమ్మతులు, రక్షిత మంచినీటి సరఫరా మరియు వీధి దీపాల (స్ట్రీట్ లైట్స్) నిర్వహణకు కేటాయించాలి.
  • మిగిలిన 20 శాతం నిధులు: ప్రాథమిక కేటాయింపులు, నిర్దేశిత అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం కేంద్రం వద్దే ఉంచుకోనుంది.
  • ఈ నిధుల విడుదలతో గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న ప్రాథమిక సమస్యలు పరిష్కారం కావడంతో పాటు పల్లెల్లో మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడనున్నాయి

సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌కు సీఎం చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha