Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం.. తేదీపై కలెక్టర్ కీలక ప్రకటన

త్వరలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం.. తేదీపై కలెక్టర్ కీలక ప్రకటన

వార్త 5 days ago

Bhogapuram Airport Updates: ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త కిశోర్ వెల్లడించారు.

ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ పనులు శరవేగంగా తుది దశకు చేరుకుంటున్నాయని, త్వరలోనే విమానాశ్రయ అధికారిక ప్రారంభ తేదీని కూడా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Bullet Train: హైదరాబాద్ టు చెన్నై ఇక 2 గంటల్లోనే!

 Bhogapuram Airport to open soon.

Bhogapuram Airport Updates: ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు

విశాఖపట్నం నగరం నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణికులు సులభంగా, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేరుకోవడానికి వీలుగా రహదారుల అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విశాఖ-భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనుసంధానానికి సంబంధించి మొత్తం 7 రోడ్లను ప్రతిపాదించగా.. అందులో ఇప్పటికే ఐదు కీలక రహదారుల నిర్మాణ పనులను విజయవంతంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ అభిషిక్త కిశోర్ వివరించారు. మిగిలిన రోడ్ల పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందుకోసం విశాఖపట్నం నగరం లోని ముఖ్య ప్రాంతాల నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు నేరుగా వెళ్లేందుకు ‘డెడికేటెడ్ ఆర్టీసీ (APSRTC) బస్సు సర్వీసులను’ ప్రత్యేకంగా నడుపుతామని ఆయన పేర్కొన్నారు. ఈ రవాణా సదుపాయాల వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు కూడా ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ ఎంతో సులభతరం కానుంది.

Epaper: epaper.vaartha.com

అమరావతికి జగన్ వ్యతిరేకం కాదు.. అవినాష్ కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha