Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలోనే జైళ్ల శాఖ ప్రక్షాళన చేపడతాం.. వంగలపూడి అనిత

త్వరలోనే జైళ్ల శాఖ ప్రక్షాళన చేపడతాం.. వంగలపూడి అనిత

వార్త 6 days ago

AP Home Minister Anitha: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తిరుపతిలోని స్పెషల్ సబ్ జైల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. సోమవారం ఉదయం నేరుగా సబ్ జైలుకు వెళ్లిన ఆమె, అక్కడ ఖైదీల వసతులు, ఆహారం, రక్షణ ఏర్పాట్లపై జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన హోం మంత్రి.. ఖైదీలలో సత్ప్రవర్తన, మార్పు తీసుకురావడమే జైళ్ల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.

జైలు విస్తీర్ణం చాలా తక్కువగా ఉందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. “ఈ జైలులో 120 మంది ఖైదీలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 140 మంది ఉన్నట్లు పరిశీలనలో తేలింది. జైలు ప్రస్తుత విస్తీర్ణం కేవలం 70 సెంట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. జైలు పరిధిని ఇక్కడే విస్తరించాలా? లేదా మరోచోట కొత్తగా సబ్ జైలు నిర్మాణం చేపట్టాలా? అనే విషయాలపై త్వరలోనే సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం” ఖైదీల భద్రత ప్రభుత్వ బాధ్యతని అని ఆమె వెల్లడించారు.

Read Also : Bellampally :మరణానంతరం నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు!

 We will soon carry out a purge of the prisons department.. Vangalapudi Anitha

AP Home Minister Anitha: అవసరమైతే మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

కేసులను వేగంగా విచారించి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని హోం మంత్రి తెలిపారు. అవసరమైతే మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె ప్రకటించారు. జైలు సిబ్బంది విధివిధానాలు, పోలీసుల విధులు వేర్వేరుగా ఉంటాయన్న ఆమె.. ఖైదీల మనస్తత్వంలో మార్పు కోసం జైలు సిబ్బంది వారికి నిరంతరం కౌన్సెలింగ్ ఇస్తూ దగ్గరగా ఉంటున్నారని అభినందించారు.

పెరోల్ ఖైదీలపై నిఘా..

జైళ్ల శాఖలో త్వరలోనే పూర్తిస్థాయి ప్రక్షాళన చేపడతామని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. జైలు నుంచి పెరోల్‌పై బయటకు వచ్చే ఖైదీల కదలికలపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిరుద్యోగులకు మేలు చేసేలా.. రాబోయే జాబ్ క్యాలెండర్ ద్వారా పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ పారదర్శకంగా భర్తీ చేస్తామని ఈ సందర్భంగా హోం మంత్రి కీలక ప్రకటన చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. ఆకివీడు రామాలయం పనులపై బ్రేక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha