Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ట్విషా శర్మ మృతి కేసు: న్యాయవ్యవస్థపై ప్రచారంపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం

ట్విషా శర్మ మృతి కేసు: న్యాయవ్యవస్థపై ప్రచారంపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం

వార్త 3 weeks ago

Twisha Sharma death case: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా భావోద్వేగ వ్యాఖ్యలు చేసింది.

నిందితులను న్యాయవ్యవస్థే రక్షిస్తోందంటూ జరుగుతున్న సోషల్ మీడియా, మీడియా ప్రచారాలు తమకు తీవ్ర బాధ కలిగించాయని ధర్మాసనం పేర్కొంది. మృతురాలి అత్త విశ్రాంత న్యాయమూర్తి అనే ఒకే ఒక్క కారణంతో విచారణ పట్టాలు తప్పుతోందని అనడం దురదృష్టకరమని, ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా దర్యాప్తు జరగాలనే ఉద్దేశంతోనే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

Coimbatore Crime Case: చిన్నారి అత్యాచారం పై సీఎం విజయ్ సీరియస్.. విచారణకు ఆదేశం

 Twisha Sharma death case

మీడియాపై సుప్రీంకోర్టు ఆంక్షలు మరియు సూచనలు

ఈ కేసులో మీడియా జోక్యం మితిమీరిపోతోందని అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, క్రింది మార్గదర్శకాలను జారీ చేసింది:

  • ప్రకటనల ప్రసారం నిలిపివేత: బాధితురాలు లేదా నిందితుల కుటుంబ సభ్యులు ఇచ్చే ఎలాంటి ప్రకటనలను గానీ, ఇంటర్వ్యూలను గానీ మీడియా సంస్థలు ప్రసారం చేయకూడదు.
  • ముందస్తు కథనాలపై నిషేధం: కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ముందస్తు ఊహాజనిత కథనాలను (Media Trials) ప్రసారం చేయవద్దని హెచ్చరించింది.
  • సాక్షుల రక్షణ: భవిష్యత్తులో కోర్టులో కీలక సాక్షులుగా మారే అవకాశం ఉన్న వ్యక్తుల వద్దకు వెళ్లి వివరాలను సేకరించడం లేదా రికార్డ్ చేయడం చేయవద్దని మీడియాకు సూచించింది. కుటుంబ సభ్యుల వద్ద ఉన్న సమాచారాన్ని కేవలం దర్యాప్తు సంస్థల ముందే నమోదు చేయించాలని స్పష్టం చేసింది.

Twisha Sharma death case: రంగంలోకి సీబీఐ.. భోపాల్‌లో రెండో పోస్ట్‌మార్టం

ట్విషా శర్మ మరణంపై దర్యాప్తును అధికారికంగా సీబీఐ (CBI) స్వీకరించింది. అందుకోసం ప్రత్యేక సీబీఐ బృందం ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చేరుకుంది. స్థానిక పోలీసుల నుంచి కేసు డైరీ, ఆధారాలను సీబీఐ స్వాధీనం చేసుకోనుంది. కాగా, మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్-భోపాల్ (AIIMS-Bhopal) వైద్య బృందం ఆదివారం ట్విషా మృతదేహానికి రెండోసారి శవపరీక్ష (Re-Postmortem) నిర్వహించింది. ఈ చర్యను సుప్రీంకోర్టు అభినందించింది. నటి ట్విషా శర్మకు వివాహమైన కేవలం ఐదు నెలలకే మే నెల ప్రారంభంలో భోపాల్‌లోని ఆమె అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. మరణానికి ముందు ఆమె తన తల్లి, స్నేహితురాలికి పంపిన సందేశాలు (Messages) తీవ్ర సంచలనం సృష్టించాయి. తాను తీవ్ర మానసిక క్షోభ, వరకట్న వేధింపులు అనుభవిస్తున్నానని, తన జీవితం నరకంలా మారిందని ఆమె అందులో పేర్కొంది. ట్విషా భర్త న్యాయవాది కావడం, అత్త రిటైర్డ్ జడ్జి కావడంతో కేసును తొక్కిపెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha