Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TVK జెండా రంగు చీరలో త్రిష, విజయ్ స్టెప్పులు..

TVK జెండా రంగు చీరలో త్రిష, విజయ్ స్టెప్పులు..

వార్త 1 month ago

TVK Party: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంటే, అటు సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ పాత వీడియోలను వెలికితీస్తూ రచ్చ చేస్తున్నారు.

ముఖ్యంగా 'ది గోట్' చిత్రంలోని 'మట్టా' (Matta) పాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Read Also : Election Results: బెంగాల్, అస్సాంలో బీజేపీ జోరు

జెండా రంగులు.. త్రిష చీర రంగులు!

ఈ పాటలో నటి త్రిష కనిపించే ఒక ప్రత్యేకమైన సీన్‌లో ఆమె ధరించిన చీర రంగులు పసుపు, ఎరుపు (Yellow & Red) కలయికలో ఉంటాయి. విజయ్ తన పార్టీ జెండాను ప్రకటించినప్పుడు అందులో ప్రధానంగా పసుపు రంగు, పైన, కింద ఎరుపు రంగు పట్టీలు ఉన్నాయి. త్రిష చీర రంగులు సరిగ్గా టీవీకే జెండా రంగులను పోలి ఉండటంతో, "విజయ్ అప్పుడే తన పార్టీ జెండా రంగుల గురించి క్లూ ఇచ్చాడు" అంటూ నెటిజన్లు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

TVK Party: ముందే ప్లాన్ చేశారా?

సాధారణంగా విజయ్ తన సినిమాల్లో రాజకీయాల గురించి చిన్న చిన్న హింట్స్ ఇవ్వడం అలవాటే. ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా "ఇది యాధృచ్ఛికంగా జరిగింది కాదు.. దళపతి ముందే పక్కా ప్లాన్‌తో ఈ కలర్ కాంబినేషన్‌ను ఎంచుకున్నారు" అని కామెంట్స్ చేస్తున్నారు. ఫలితాల్లో టీవీకే ఆధిక్యంలో ఉండటంతో ఈ వీడియోలకు లైకులు, షేర్ల వర్షం కురుస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

మహిళా బిల్లును వ్యతిరేకించిన వారికి ప్రజలే గుణపాఠం చెప్పారు: బండి సంజయ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha