PM Modi : ప్రపంచ యవనికపై ప్రధాని నరేంద్రమోడీ ఐదు రోజుల పర్యటన భారత్ వైశిష్ట్యాన్ని, ఇతర దేశాలతో సౌహార్ద్ర సంబంధాలను పెంపొందింప చేసింది. మధ్యప్రాచ్యదేశాలతో భారతదేశ విదేశాంగ విధానానికి, ఆర్థిక వ్యూహానికి, సంబంధ బాంధవ్యాలకు ప్రతీకగా ఈ పర్యటన కొత్త పుంతలు తొక్కుతోంది.
సమగ్ర వ్యూహా త్మక భాగస్వామ్యంపై భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి మధ్య చర్చలనంతరం ఇరు దేశాల మధ్య సౌభ్రాతృత్వం వెల్లి విరిసింది. భారత్ అభివృద్ధికి ఎమి రేట్స్ చేయూత నిచ్చేందుకు చేయి కలిపింది. తాజాగా చేసుకున్న ఒప్పందాలతో భారత్ దీర్ఘకాలిక ప్రయోజనాలకు అంకురార్పణ జరిగినట్లయింది. గతంలో కన్నా మినననగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలకు కొత్త దిశానిర్దేశం ఏర్పడింది. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి రాచబాటుకు ఆస్కారం కలిగింది.
Read Also: India-Sweden: మోదీ, ఉల్ఫ్ ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల అంగీకారం
PM Modi
PM Modi : స్థానిక కరెన్సీతో మాత్రమే వాణిజ్య లావాదేవీలు
భారత్, యుఎఇల మధ్య రక్షణ రంగ పారిశ్రామికత పెంపొందే దిశగా డిఫెన్స్టెక్నాలజీ, శిక్షణ, రంగ అంశాలలో సంయుక్త కసరత్తు పరస్పర సహకారంతో పాటు సైబర్ డిఫెన్స్, మారిటైన్కు సెక్యూరిటీ విభాగా లను వృద్ధి బాటలో నడుపుతారు. యుఎఇ భారత్ల మధ్య దౌత్యపర అంశాల్లో మరింత మేలైన కదలికకు ముందడుగు పడింది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్భారత్కు అత్యంత కీలక వ్యాపార భాగస్వామ్య దేశా లలో ఒకటి. చమురు దిగుమతులు, పెట్టుబడులు, వాణిజ్యం, మౌలిక వసతులు, ఫిన్దెక్, రక్షణ రంగాల్లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన ఒడంబడికలు చెప్పుకో దగినవే. ప్రధాని ఐదు రోజుల పర్యటనల్లో భాగంగా తొలి అడుగు యుఎఇలోనే పడింది. డాలర్పై ఆధారపడే వాణిజ్యాన్ని తగ్గించుకోవాలనే ఆసక్తితో ముందుకు సాగు తూనే భారతీయ ఆర్థిక వ్యవస్థకు మరింత బలపరిచే విధంగా ఇప్పుడు వడివడిగా అడుగులు పడుతున్నట్లు చెప్పుకోవాలి. డాలర్ను పక్కనబెట్టి స్థానిక కరెన్సీతో మాత్రమే వాణిజ్య లావాదేవీలు జరగాలని, డిజిటల్చెల్లింపుల విస్తరణ, పోర్టులో, లాజిస్టిక్స్ రంగాలో పెట్టు బడులపై మరిన్ని ఒప్పందాలు జరిగాయి. ఇరుదేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం జరిగినట్లే.
భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం
మలి అడుగు నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీదేశాల్లో పర్యటిస్తారు. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధ తరుణంలో ప్రధాని పర్యటన భారత్కు మేలు చేయగల ధీశక్తిగా రూపొందుతుంది. భారత్, యుఎఇ మధ్య సంబంధాలు కొత్తవి కావు. అరేబ్ గల్ఫ్ ప్రాంతాలలో భారత్వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు శతాబ్దాల కాలం నుంచే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరింత బలపడనున్నాయి. ప్రధానంగా గుజరాత్, కేరళ (పాంతాల వాణిజ్యంలో సుగంధ ద్రవ్యాలు, వస్త్ర, వైడూర్యాల వ్యాపారాలు బాగా జరిగాయి. 1971నుంచే భారత్లో వాణిజ్య సంబంధాలు (ప్రారంభమయ్యాయి. తొలుత చమురు దిగుమతులు, భారతీయ కార్మికుల ఉపాధి కల్పనతో సంబంధం బలపడింది. రానురాను గల్ఫ్ దేశాల్లో నిర్మాణ రంగం బలపడి ఎంతో మంది భారతీయ కార్మికులు, ఆ ప్రాంతానికి వలస వెళ్లారు. అందుకే యుఎఇలో ఉపాధి కోసం వెళ్లే లక్షలాది భారతీయుల కారణంగానే భారత్కు భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. తాజా పెట్టుబడులతో భారత్కు మరింత విదేశీ మారకద్రవ్యాలు లభించే ఆస్కారం ఉంది.
ఉగ్రవాదం నిరోధం
ప్రధానిగా నరేంద్రమోడీ హయాంలో ఈ ఉభయ దేశాల మధ్య మంచి మంచి ఒప్పందాలు జరిగి మరింత వేగంగా అభివృద్ధి బాటలో నడిచాయి. 2015లో భారత ప్రధాని యుఎఇ సందర్శిం చిన అనంతరం ఇరుదేశాల స్నేహ సౌహార సంబంధాల్లో పెను మార్పు వచ్చింది. అంతకు 30 సంవత్సరాలకు మునుపు భారత్ అధికారులు యుఎఇ ని సందర్శించిన దాఖలాలు మాత్రమే ఉన్నాయి. అటు పిమ్మట రెండు దేశాల మధ్య ఉగ్రవాదం నిరోధం, సమాచార మార్పిడి, నౌకాయాన భద్రత, వంటి అంశాల్లో పరస్పర సంబంధా లు మెరుగయ్యాయి. 2020లో కుదిరిన ‘సెపా’ (కాంపహెన్షివ్ ఎకనామిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్)తో ఇరు దేశాల వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపరచింది. ఈ ఒప్పందం మేరకు అనేక వస్తువులపై దిగుమతి సుంకాలు తగ్గి ద్వైపాక్షిక వాణిజ్యం తీరుతెన్నులో మార్పు వచ్చింది. వాణిజ్యాంశాలు ఉభయతారకంగా మారాయి. భారతీయ ప్రవాసులు గౌరవ ప్రపత్తులు పెంచే రీతిలో అరబ్, గల్ఫ్లో ఉన్న భారతీయుల సంక్షేమం ఉద్యోగ భద్రత, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో మార్పులు సంభవించాయి. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంస్కృతికి గుర్తింపు లభించే విధంగా యుఎఇలో హిందూ దేవా లయ నిర్మాణానికి ప్రోది కల్పించింది.
PM Modi
ఐదు బిలియన్ డాలర్లు పెట్టుబడి
గల్ఫ్ ప్రాంత రాజకీయ అస్థిరత, చమురు ధరల్లో మార్పులు, విదేశీ కార్మికుల అంశాల వంటి సవాళ్ల ప్రభావం భారత్ మీద ఉండనే ఉంటుంది. తాజా పర్యటనలో భారత్లోని విభిన్న రంగాల్లో ఐదు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేం దుకు యుఎఇ ముందుకొచ్చింది. ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహ్మద్బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా భారత్ను త్వరలోనే సందర్శిస్తారు. అప్పుడు కూడా మరిన్ని పెట్టుబడులను ఆయన వెంట వచ్చే అవకాశాన్ని కాదనలేం. భారత్లోని వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలలో 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేసేందుకు యుఎఇ అధ్యక్షుడు షేక్మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అంగీకరించడం తో ఉభయ దేశాల మధ్య ఇంధన రంగ భాగస్వామ్యం మరింతగా బలపడింది. ముడి చమురు, ఎల్ఎన్ఎ, ఎల్పిజి సరఫరాలను కలుపుకొని సమగ్ర భాగస్వామ్యం కోసం కృషి చేయాలని ఇరుదేశాల నిర్ణయాన్ని స్వాగతిద్దాం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

