Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉచిత బస్సు పథకం రద్దు వార్తలు.. ఏపీ సర్కార్ ఇచ్చిన షాకింగ్ క్లారిటీ!

ఉచిత బస్సు పథకం రద్దు వార్తలు.. ఏపీ సర్కార్ ఇచ్చిన షాకింగ్ క్లారిటీ!

వార్త 5 days ago

AP Free Bus Scheme: ఏపీలో మహిళల కోసం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం నిలిచిపోతుందంటూ సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

డీజిల్ బస్సుల స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తుండటంతో ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేస్తారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఊహాగానాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందిస్తూ ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని తేల్చి చెప్పింది. మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఎప్పటిలాగే కొనసాగుతుందని అధికారికంగా స్పష్టం చేసింది.

Read also: Dornala Bus Stand: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. దోర్నాలలో కొత్త ఆర్టీసీ బస్టాండ్!

 ap rtc free bus travel for women info

AP Free Bus Scheme: 67 కోట్ల ప్రయాణాలు.. భారీగా పెరిగిన ఆర్టీసీ ఆదాయం

గడచిన 9 నెలల కాలంలో ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు సుమారు 67 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సంబంధించిన రూ. 2,350 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. ఈ వినూత్న పథకం కారణంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో 60 శాతం నుండి ఏకంగా 92 శాతానికి పెరిగింది. మహిళల రాకతో సంస్థ ఆదాయం కూడా మునుపటి కంటే చాలా మెరుగైందని అధికారులు గణాంకాలతో వివరించారు.

ప్రయాణికుల సౌకర్యం కోసమే సరికొత్త ఈవీ బస్సులు

ఆర్టీసీ సేవలను మరింత ఆధునీకరించే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 1,450 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారు. ప్రయాణికులకు కాలుష్య రహిత, మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించడానికే ఈ సరికొత్త ఈవీ బస్సులను తెస్తున్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల మహిళల మరణాల సంఖ్య కూడా 39 శాతం మేర తగ్గిందని పోలీసుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు పోస్టులను నమ్మి ఆందోళన చెందవద్దని ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

చిన్న వయసులోనే పెళ్లి పీటలు.. ఏపీ, తెలంగాణలో ఘోరంగా పెరుగుతున్న చైల్డ్ మ్యారేజెస్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha