Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్

వార్త 3 days ago

Udhayanidhi Stalin : తమిళనాడు రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే (DMK) కీలక నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ సమాచారం అందుకున్న డీఎంకే నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట జరిగి, రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 Udayanidhi Stalin

విజయ్-త్రిషపై వ్యాఖ్యల వివాదం - కేసు నమోదుతో పోలీసుల చర్యలు

విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీపై మరియు సినీ నటులు విజయ్, త్రిషలను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ టీవీకే వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఉదయనిధిపై పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, దాని ఆధారంగానే ఈ అరెస్ట్ ప్రక్రియ కొనసాగినట్లు తెలుస్తోంది. రాజకీయం మరియు సినీ రంగానికి చెందిన ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు ఈ స్థాయిలో వివాదాస్పదమై అరెస్ట్‌కు దారితీయడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

హెచ్‌-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..భారతీయులపై తీవ్ర ప్రభావం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha