Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉగ్రలింకులు: ఓ మహిళ సహా ఇద్దరు అరెస్ట్..

ఉగ్రలింకులు: ఓ మహిళ సహా ఇద్దరు అరెస్ట్..

వార్త 3 months ago

అదుపులో మరో తొమ్మిది మంది

Vijayawada Terrorist Links: విజయవాడ ఉగ్ర లింక్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసారు టెర్రర్ లింక్ కేసులో హైదరాబాద్ కు చెందిన సైదా బేగం, బెంగళూరుకు చెందిన అబ్దుల్ సలాంను అరెస్టు చేసిన పోలీసులు.

హైదరాబాద్ చంచల్గూడలోని సయీదా బేగం నివాసంలో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం సయీదా బేగంకు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చి, అదుపులోకి తీసుకున్నారు. సయీదా బేగంను విజయవాడకు తరలించారు. టెర్రర్ లింక్ కేసులో హైదరాబాద్ మహిళను విజయవాడ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చి నిందితురాలిని విజయవాడకు తీసుకువచ్చారు. రహస్య ప్రాంతంలో ఆమెను ప్రశ్నిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక సయిదాను విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

Key arrests in the Vijayawada terror links case.

Vijayawada Terrorist Links: సోషల్ మీడియా ద్వారా యువతకు వల

మహారాష్ట్రంలోని షోలాపూర్కు చెందిన సయిదా బేగం చాలా ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటోంది. గతంలో అనుమానంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ఓసారి ఆమెను విచారణ చేశారు. అయినా ఏమాత్రం భయం లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యువకుల్ని టెర్రరిజం వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలోని వించిపేటలో రెండు రోజుల క్రితం అరెస్టయిన ముగ్గురు యువకులకు ఉగ్రవాద భావజాలం ఎక్కించడంలో సయిదా కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

విదేశీ హ్యాండ్లర్‌తో సంబంధాలు

సుమారు ఏడాదిగా వారితో ఆన్లైన్లో కమ్యూనికేట్ అవుతున్నట్లు తేల్చారు. సాయిదా బేగం వెనుక ఓ విదేశీ హ్యాండ్లర్ ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. వీళ్లతో పాటు మొత్తం 12 మంది సభ్యుల గ్యాంగ్ ఆన్లైన్లో టచ్లో ఉన్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి, 5 ప్రాంతాలకు పంపించారు

ఏప్రిల్ 6 వరకు రిమాండ్

ఇప్పటికే ఈ కేసులో విజయవాడ ఉగ్ర లింకు కేసులో నిందితులు మహ్మద్ రెహ్మతుల్లా, మీర్జా సోహెల్, మహ్మద్ డానిష్లను విజయవాడ సీఎంఎం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఏప్రిల్ 6 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో వారిని విజయవాడ కేంద్ర కారాగారానికి తరలించారు. విచారణ సందర్భంగా న్యాయవాదిని నియమించుకున్నారా? అని నిందితులను న్యాయమూర్తి ప్రశ్నించగా, తాము నియమించుకోలేమని తెలిపారు. ఈ విషయాన్ని రాత పూర్వకంగా కోర్టుకు ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది. నిందితులకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వలు ఇవ్వడంతో వారిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha