Russia-Ukraine War: ఉక్రెయిన్ దేశంపై రష్యా సైన్యం మరోసారి అత్యంత దారుణమైన దాడికి పాల్పడింది. రష్యా జరిపిన భీకర డ్రోన్ దాడిలో 13 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ అనూహ్య పరిణామంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

డ్నిప్రో స్టేషన్‌లో నిలిచిన రైలుపై విరుచుకుపడ్డ డ్రోన్లు
గురువారం ఉదయం పూట ఉక్రెయిన్‌లోని రద్దీగా ఉండే డ్నిప్రో రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులతో కూడిన ఒక రైలు ఆగిఉంది. సరిగ్గా అదే సమయంలో స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌పై రష్యా బలగాలు డ్రోన్లతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ అధికారులు స్పష్టం చేశారు. రైలు నిలిచివున్న సమయంలో ఈ దాడి జరగడంతో ప్రాణనష్టం భారీగా సంభవించింది.
Russia-Ukraine War: క్షతగాత్రులకు చికిత్స – అధికారుల వెల్లడి
ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

