Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉల్లి రైతులకు శుభవార్త.. పెరిగిన కొనుగోలు ధర

ఉల్లి రైతులకు శుభవార్త.. పెరిగిన కొనుగోలు ధర

వార్త 3 weeks ago

Onion price hike: ఉల్లి రైతులకు శుభవార్త అందింది. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్ కోసం సేకరించే ఉల్లి ధరను 13 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఈ పెంపుతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటకు సరైన ధర లభించడంతో సాగులో ఉన్న వారికి పెద్ద ఊరట లభించింది..

Read also: Satna Well Accident: బావిలో పడిన ఎద్దును కాపాడబోయి ముగ్గురు మృతి

 Good news for onion farmers.

ఎంత పెరిగింది అంటే?

గతంలో ఉల్లి క్వింటాల్ ధర రూ.1,875గా ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఈ ధర రూ.2,125కు చేరింది. ఈ సీజన్‌లో ధరలను పెంచడం కేంద్రం ఇది ఐదోసారి. ప్రభుత్వం నిర్ణయం వల్ల రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. మార్కెట్లో ఉల్లి సాగు చేస్తున్న వారికి ఈ నిర్ణయం ఎంతో ప్రోత్సాహకరంగా మారింది.

Onion price hike: రైతులపై సానుకూల ప్రభావం

దేశవ్యాప్తంగా ఉల్లి సాగు చేసే రైతులందరికీ ఈ పెంపు వర్తిస్తుంది. బఫర్ స్టాక్ కోసం కేంద్రం పెద్ద ఎత్తున ఉల్లిని సేకరిస్తోంది. ప్రభుత్వం ధరలు పెంచడం వల్ల మార్కెట్లో మిగిలిన వ్యాపారుల దగ్గర కూడా ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. సాగు పెట్టుబడులు పెరిగిన తరుణంలో ప్రభుత్వ సాయం రైతులకు ధైర్యాన్ని ఇస్తోంది..

Epaper: epaper.vaartha.com

రైతులకు గుడ్ న్యూస్.. రూ.300 కే యూరియా బ్యాగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha