Dailyhunt
ఉప్పల్‌లో సమరం: హైదరాబాద్ వర్సెస్ లక్నో.. పరుగుల వేటలో గెలుపు ఎవరిది?

ఉప్పల్‌లో సమరం: హైదరాబాద్ వర్సెస్ లక్నో.. పరుగుల వేటలో గెలుపు ఎవరిది?

వార్త 1 week ago

SRH vs LSG Today Match: ఐపీఎల్ 2026 (19వ సీజన్) లో నేడు మరో ఉత్కంఠభరిత పోరుకు తెరలేవనుంది. తొలి డబుల్ హెడర్‌లో భాగంగా మధ్యాహ్నం జరగబోయే మొదటి మ్యాచ్‌లో పరుగుల యంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), పటిష్టమైన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు తలపడనున్నాయి.

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.

Read Also:GT Live IPL Score:13, 15 ఓవర్లలో బిష్ణోయ్ (4 వికెట్లు) విధ్వంసం

SRH vs LSG Today Match: గత రికార్డు లు పరిశీలిస్తే

ఐపీఎల్‌లో ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లో లక్నోదే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకు హైదరాబాద్ - లక్నో ఆరు మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో లక్నో అత్యధికంగా నాలుగు మ్యాచ్‌లలో గెలవగా, సన్‌రైజర్స్ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. హైదరాబాద్ వేదికగా గతేడాది జరిగిన బిగ్ ఫైట్‌లో లక్నో 190 పరుగుల టార్గెట్‌ను కేవలం 16.1 ఓవర్లలోనే ఛేదించింది.

జట్లలో మార్పులు ఇలా..

తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మూడో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు. అతని గైర్హాజరు జట్టుకు కొంత ప్రతికూలాంశం. బౌలింగ్ విభాగంలో డేవిడ్ పైన్ స్థానంలో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన బ్రైడన్ కార్స్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా అదే కూర్పుతో బరిలోకి దిగాలని భావిస్తోంది. మొత్తం మీద హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో సన్‌రైజర్స్ బరిలోకి దిగుతుండగా, పాత రికార్డులతో లక్నో ధీమాగా ఉంది. ఈ బ్యాటర్ల యుద్ధంలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

 SRH vs LSG IPL 2026

పిచ్ రిపోర్ట్

ఉప్పల్ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు స్వర్గధామం. గత సీజన్లలో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. నేటి మ్యాచ్ మధ్యాహ్నం జరగనుండటంతో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల స్పిన్నర్లు కొంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ, చిన్న బౌండరీల కారణంగా సిక్సర్ల వర్షం కురవడం ఖాయం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనా

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్ / హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్స్ / డేవిడ్ పైన్, ఈషాన్ మలింగ.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అంచనా

మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, ఆయుష్ బదోనీ, నికోలస్ పూరన్, అబ్దుల్ సమ్మద్, ముకుల్ చౌదరి, దిగ్వేష్ రాఠీ, మొహమ్మద్ షమీ, నోకియా, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం..ఓడిన GT

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha