భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే కీలక ఘట్టం చోటుచేసుకుంది. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు Ursula von der Leyen శనివారం ఢిల్లీకి చేరుకున్నారు.
ఆమెతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా ఈ పర్యటనలో భాగస్వాములయ్యారు.
ఢిల్లీ విమానాశ్రయంలో ఉర్సులాకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఘన స్వాగతం పలికారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాలైన భారత్, ఈయూ మధ్య పరస్పర నమ్మకం, భాగస్వామ్య విలువలు మరింత బలపడుతున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనకు ఈయూ విదేశాంగ విధాన చీఫ్ కజా కల్లాస్ కూడా హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఈయూ నేతల భారత పర్యటన కీలకంగా మారింది. ప్రధాని Narendra Modi ఆహ్వానం మేరకు వచ్చిన ఈయూ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలుసుకోనున్నారు. జనవరి 27న జరగనున్న 16వ భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో వాణిజ్యం, సరఫరా గొలుసులు, భద్రత, సాంకేతిక సహకారం వంటి అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Suryapet child murder: బిడ్డను నరబలి ఇచ్చిన తల్లికి హైకోర్టు ఉరిశిక్ష రద్దు

