Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉత్తర తెలంగాణ విద్యుత్ సంస్థకు జాతీయ స్థాయి అవార్డు

ఉత్తర తెలంగాణ విద్యుత్ సంస్థకు జాతీయ స్థాయి అవార్డు

వార్త 2 months ago

Telangana NPDCL Wins IT: డిజిటల్ విద్యుత్ సేవల విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల అమలు, వినియోగదారులకు నాణ్య మైన సేవల అందజేయడంలో విశేష కృషికి గాను ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) దేశ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన 11వ గవర్నెన్స్ నౌ పిఎస్ యు ఐటీ అవార్డు దక్కింది.

ఈ విషయాన్ని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రత్యేక అవార్డుల ప్రదానోత్సవంలో సంస్థకు ప్రతి ష్టాత్మక ‘గవర్నెన్స్ నౌ 11వ ఇండియా పిఎస్ యు ఐటీ అవార్డు’ను ఎన్పీడీసీఎల్ నుంచి కంపెనీ సెక్రటరీ కే.వెంకటేశం, కే. వెంకటేశం, జియం శ్రీనివాస్ అందుకున్నారు. ఈ అవార్డును సోమవారం ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డును అందచేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, డిజిటల్ పరివర్తన వైపు అడుగులు వేస్తున్నందుకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు చెప్పారు.

Read Also : Telangana Paddy Farmer : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్న అన్నదాత

 National level award for North Telangana Electricity Company

Telangana NPDCL Wins IT: స్మార్ట్ గ్రిడ్ దిశగా అడుగులు

ముఖ్యంగా సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అవుటేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి ఆధునిక వ్యవస్థల అమలు ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థను స్మార్ట్ గ్రిడ్ దిశగా తీసు కెళ్తున్నందుకు సంస్థకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు తమ సంస్థ పరిధిలో అమలు చేస్తున్న డిజిటల్ వ్యవస్థల ద్వారా విద్యుత్ అంతరాయాలను క్షణాల్లో గుర్తించడం, లోపాలను వేగంగా సరిచేయడం, వినియోగ దారులకు ముందస్తు సమాచారం అందించడం, విద్యుత్ నష్టాలను తగ్గించడం వంటి అంశాల్లో మ్యాపింగ్ ద్వారా ప్రతి ట్రాన్స్ ఫార్మర్, ఫీడర్, గణనీయమైన పురోగతి సాధిస్తోందన్నారు. జిఐఎస్ విద్యుత్ లైన్, వినియోగదారుని డిజిటల్ మ్యాప్లో నమోదు చేయడం వల్ల నెట్వర్క్ ప్రణాళిక, లోపాల గుర్తింపు, అత్యవసర మర మ్మ తు పనులు మరింత వేగవంతం అవుతున్నా యని చెప్పారు. ఈ డిజిటల్ మార్పుల ఫలితంగా ఫాల్ట్ రీస్టోరేషన్ సమయం గంటల నుండి నిమిషాలకు తగ్గడం, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కా రంలో వేగం పెరగడం, నష్టాలు తగ్గడం, విద్యుత్ సరఫరా విశ్వసనీయత మెరుగుపడడం వంటి ఫలితాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అంగన్‌వాడీ టీచర్ల జీతాల పెంపుపై మంత్రి సీతక్క కీలక ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha