Data Centers : ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన డేటా సెంటర్ల స్థాపనపై వస్తున్న పుకార్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెరదించారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో మాట్లాడిన ఆయన, ఉత్తరాంధ్రలో ఏర్పాటయ్యే డేటా సెంటర్ల అవసరాలకు కేవలం 3.5 టీఎంసీల (TMC) నీరు సరిపోతుందని స్పష్టం చేశారు.
పరిశ్రమల వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడుతుందంటూ కొందరు కావాలని అపహాస్యాలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సాంకేతిక రంగాన్ని మరియు పారిశ్రామికాభివృద్ధిని అడ్డుకునేందుకు జరిగే ఇటువంటి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఆధునిక డేటా సెంటర్లు పర్యావరణహితమైన సాంకేతికతతో పనిచేస్తాయని సీఎం వివరించారు.

పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీరు
విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని చంద్రబాబు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గ్రావిటీ (గురుత్వాకర్షణ) పద్ధతిలోనే విశాఖలోని పరిశ్రమలకు సమర్థవంతంగా నీటిని సరఫరా చేస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక రంగాన్ని విస్తరించే లక్ష్యంతో, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో పారిశ్రామికవాడలు (ఇండస్ట్రియల్ పార్కులు) అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ స్థాయి వరకు పరిశ్రమలను విస్తరించి, యువతకు పెద్దపీట వేస్తూ ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో గంటలోనే ఎయిర్‌పోర్ట్‌కు చేరేలా ప్రణాళిక - 3 కొత్త విమానాశ్రయాల తొలి దశ వివరాలు

