Vahan beema renewal:ప్రతి వాహనదారుడు తనిఖీ సమయంలో మోటార్ నిబంధనలు పాటించాలి. సరిగ్గా సమయానికి వాహన బీమా గడువు పూర్తి కాగానే రెన్యూవల్ చేసుకోవడం చాలా ముఖ్యం.
గనుక మోటార్ వాహనాల చట్టం ప్రకారం పాలసీ గడువు దాటితే సమస్యలు వస్తాయి. రూ.2,000 నుండి రూ.4,000 వరకు జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాలలో మూడు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
Read also: Mumbai news: పదో అంతస్తు నుంచి దూకిన మహిళ.. చెట్టు పుణ్యమా అని!
Heavy fines for expired vehicle insurance
గడువు దాటితే చట్టపరమైన ఇబ్బందులు
పాలసీ గడువు ముగిస్తే కేవలం జరిమానాతో ఆగదు. గతంలో ఉన్న నో క్లెయిమ్ బోనస్ పూర్తిగా రద్దవుతుంది. ఒకవేళ ప్రమాదం జరిగితే మూడో వ్యక్తికి చెల్లించాల్సిన నష్టపరిహారం యజమానే భరించాలి. ఈ మొత్తం లక్షల్లో ఉండవచ్చు. కాబట్టి ఎటువంటి ఆర్థిక నష్టాలు రాకుండా చూసుకోవాలి.
Vahan beema renewal:ఆన్‌లైన్ ద్వారా సులభంగా రెన్యూవల్ చేసుకోవడం
చివరి నిమిషంలో టెన్షన్ పడకుండా ముందుగానే పాలసీ రెన్యూవల్ చేసుకోవాలి. లాప్స్ అయిన పాలసీకి మళ్లీ వాహన తనిఖీ తప్పనిసరి అవుతుంది. ఆన్‌లైన్ ద్వారా క్షణాల్లో రెన్యూవల్ పూర్తి చేయవచ్చు. ఆటో-రెన్యూవల్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులను సులభంగా తొలగించుకోవచ్చు.
Epaper: epaper.vaartha.com
నాలుగేళ్ల లోపు పిల్లలకు ఆ మందులు ఇవ్వవద్దు.. కేంద్రం నిర్ణయం

