Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వాహనదారులకు డబుల్ షాక్: 48 గంటల్లోనే రెండోసారి పెరిగిన CNG ధరలు!

వాహనదారులకు డబుల్ షాక్: 48 గంటల్లోనే రెండోసారి పెరిగిన CNG ధరలు!

వార్త 1 week ago

CNG Price Hike: పశ్చిమాసియాలో గత రెండున్నర నెలలుగా సాగుతున్న యుద్ధ సంక్షోభం ప్రభావం భారతీయ ఇంధన మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరడంతో దేశీయంగా ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి.

ఈ ఆర్థిక భారాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సగటున రూ. 3 మేర పెంచింది. అయితే, కాలుష్య రహిత మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా భావించే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) వినియోగదారులకు కూడా ఇప్పుడు గట్టి షాక్ తగిలింది.

Read Also :H1B Visa Controversy: చిల్కూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ అనుచిత వ్యాఖ్యలు

CNG Price Hike:ఢిల్లీలో రూ.80 దాటిన కిలో సీఎన్‌జీ

ఆదివారం చమురు సంస్థలు కిలో సీఎన్‌జీపై మరో రూ. 1 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. రెండు రోజుల క్రితమే రూ. 2 పెంచిన నేపథ్యంలో, కేవలం 48 గంటల వ్యవధిలోనే కిలో గ్యాస్‌పై మొత్తంగా రూ. 3 మేర ధర పెరిగింది. ఈ వరుస పెంపుదలతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ. 80.09 కి చేరగా, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఘాజియాబాద్‌లలో రూ. 88.70 కి చేరింది. బెంగళూరులో రూ. 90.10, కోల్‌కతాలో రూ. 94 చొప్పున విక్రయాలు సాగుతున్నాయి. భాగ్యనగరం (హైదరాబాద్) లో ప్రస్తుతానికి ధరలు పెరగనప్పటికీ, అక్కడ కిలో సీఎన్‌జీ రేటు ఇప్పటికే గరిష్టంగా రూ. 99 వద్ద కొనసాగుతోంది. ఈ ఆకస్మిక ధరల పెంపు ముఖ్యంగా సీఎన్‌జీ కార్లు, ఆటోలపై ఆధారపడి జీవించే రవాణా రంగ కార్మికులకు, మధ్యతరగతి వాహనదారులకు అదనపు ఆర్థిక భారంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha