IRDAI : వాహనదారులకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) శుభవార్త అందించింది. డిసెంబర్ 15 నుంచి నాలుగు రకాల కవర్లతో కూడిన కొత్త మోటార్ ఇన్సూరెన్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ విధానం ద్వారా వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ కవర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కలగనుంది. ఇప్పటివరకు పలు ఇన్సూరెన్స్ పాలసీల్లో వివిధ రకాల కవర్లు కలిపి ఉండటంతో వినియోగదారులు తమకు అవసరం లేని కవర్లకు కూడా ప్రీమియం చెల్లించాల్సి వచ్చేది. కొత్త విధానంలో మాత్రం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే తప్పనిసరిగా ఉండనుంది. మిగిలిన కవర్లను వాహనదారులు తమ అవసరాలు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎంచుకోవచ్చు.
ఓన్ డ్యామేజ్ నుంచి పిలియన్ రైడర్ వరకు.. నచ్చిన కవర్ ఎంపిక
కొత్త నాలుగు రకాల మోటార్ ఇన్సూరెన్స్ కవర్లలో ఓన్ డ్యామేజ్, ప్రయాణికుల బీమా, పిలియన్ రైడర్ లయబిలిటీ వంటి రక్షణలను వాహనదారులు విడివిడిగా ఎంపిక చేసుకోవచ్చు. ఏ కవర్‌కు ఎంత ప్రీమియం చెల్లించాల్సి వస్తుందనే వివరాలను ఇన్సూరెన్స్ కంపెనీలు స్పష్టంగా వెల్లడించాలని IRDAI సూచించింది. పాలసీ తీసుకునే సమయంలో వినియోగదారులకు వివిధ ఆప్షన్లు అందించి, ప్రతి కవర్‌కు సంబంధించిన ప్రీమియం వివరాలను తెలియజేయాలని స్పష్టం చేసింది. దీనివల్ల వాహనదారులు తమకు అవసరమైన బీమా రక్షణను మాత్రమే ఎంచుకుని ఖర్చులను నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ రంగంలో పారదర్శకత పెరగడంతో పాటు వినియోగదారులకు మరింత ఎంపిక స్వేచ్ఛ లభించనుంది.
దీపావళి గిఫ్ట్.. ఉద్యోగులకు ఏకంగా 'ఐఫోన్ 16' ఇచ్చిన ఢిల్లీ కంపెనీ

