Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వామ్మో.. శ్రేయస్ ఇంటి అద్దె రూ.7.14కోట్లు

వామ్మో.. శ్రేయస్ ఇంటి అద్దె రూ.7.14కోట్లు

వార్త 2 days ago

Shreyas Iyer House : భారత టీ20 క్రికెట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఖరీదైన ప్రాంతమైన వర్లీ (Worli) లో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను భారీ ధరతో అద్దెకు తీసుకున్నారు.

దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా పేరుగాంచిన ఈ ఏరియాలో, ఒక ప్రముఖ లగ్జరీ టవర్‌లో ఆయన ఈ ఫ్లాట్‌ను లీజుకు తీసుకున్నట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైంది. మూడేళ్ల (36 నెలల) కాలపరిమితితో జరిగిన ఈ అద్దె ఒప్పందం మొత్తం విలువ అక్షరాలా రూ. 7.14 కోట్లు కావడం విశేషం. సుమారు 3,875 చదరపు అడుగుల (Sq.Ft.) విస్తీర్ణంలో ఉండే ఈ అల్ట్రా లగ్జరీ ఫ్లాట్, ఆధునిక వసతులతో పాటు నాలుగు ప్రత్యేక కార్ పార్కింగ్ స్లాట్లను కలిగి ఉంది. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో శ్రేయస్ అయ్యర్ కుదుర్చుకున్న ఈ భారీ అద్దె ఒప్పందం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read Also : ఒలింపిక్స్‌లో కోహ్లీ ఉండాల్సిందే.. సెలక్టర్లకు శ్రీశాంత్ కీలక సూచన!

ఏడాదికేడాది పెరిగే అద్దె.. నెలకు రూ. 18.5 లక్షలతో ప్రారంభం!

ఈ లీజు ఒప్పందం ప్రకారం శ్రేయస్ అయ్యర్ చెల్లించాల్సిన నెలవారీ అద్దె ప్రతి సంవత్సరం సుమారు 7 శాతం మేర పెరుగుతూ పోతుంది. మొదటి ఏడాదిలో భాగంగా ఆయన నెలకు రూ. 18.5 లక్షల అద్దెను చెల్లిస్తారు. ఇక రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఈ అద్దె నెలవారీగా రూ. 19.79 లక్షలకు పెరుగుతుంది. ఒప్పందం ముగిసే చివరి ఏడాది, అంటే మూడో సంవత్సరంలో ఈ లగ్జరీ ఫ్లాట్ నెల అద్దె ఏకంగా రూ. 21.18 లక్షలకు చేరుకుంటుంది. ఈ లీజును ఖరారు చేసుకోవడానికి శ్రేయస్ అయ్యర్ రూ. 74 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించడమే కాకుండా, రూ. 1.84 లక్షల స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. క్రికెట్ మైదానంలోనే కాకుండా లగ్జరీ జీవనశైలిలోనూ శ్రేయస్ అయ్యర్ తన రేంజ్ చూపిస్తున్నాడని ఈ పరిణామంతో అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మొదలుకానున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 హంగామా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha