Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వాంఖెడేలో కేకేఆర్ పరుగుల సునామీ

వాంఖెడేలో కేకేఆర్ పరుగుల సునామీ

వార్త 2 months ago

KKR IPL Score 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో (MI) జరుగుతున్న కీలక పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్లు శివమెత్తారు.

వాంఖెడే స్టేడియంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించారు.

రహానే క్లాస్.. రఘువంశీ మాస్

కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అజింక్య రహానే (67) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు బలమైన పునాది వేశారు. తనదైన శైలిలో క్లాస్ షాట్లతో ముంబై బౌలర్లపై ఒత్తిడి పెంచారు. యువ ఆటగాడు రఘువంశీ (45) మెరుపు వేగంతో పరుగులు రాబట్టగా, ఆరంభంలోనే ఫిన్ అలెన్ (37) తన పవర్ హిట్టింగ్‌తో స్కోరు బోర్డుకు వేగాన్ని ఇచ్చారు. వీరి ముగ్గురి సమష్టి కృషితో కోల్‌కతా పటిష్ట స్థితికి చేరుకుంది.

KKR IPL Score 2026: ముంబై ముందు భారీ లక్ష్యం

ముంబై ఇండియన్స్ బౌలర్లు వికెట్లు తీయడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ, కేకేఆర్ బ్యాటర్లు కట్టుదిట్టంగా ఆడి స్కోరును 220కి చేర్చారు. ముంబై ఈ మ్యాచ్ గెలవాలంటే 221 పరుగులు చేయాల్సి ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖెడే పిచ్‌పై రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా సేన ఈ భారీ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రూ. 25 కోట్లు పెడితే 18 పరుగులేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha