Varanasi Update: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి'.
ఈ భారీ అడ్వెంచర్ చిత్రానికి సంబంధించి నిత్యం ఏదో ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమాలో హాలీవుడ్, బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్-జోన్స్ నటించనుందనే వార్త సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read also:Romanchakam Movie: ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌గా 'రొమాంచకం
కీలక పాత్రలో మెరవనున్న హాలీవుడ్ బ్యూటీ?
ఈ పాన్-వరల్డ్ చిత్రంలో డైసీ ఎడ్గర్-జోన్స్ ఒక విదేశీ భామగా నటిస్తారని, మహేష్ బాబుతో కొన్ని కీలకమైన, ఆసక్తికరమైన రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ నటి రాకతో సినిమా రేంజ్ మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మిస్సయిన ‘RRR’.. లక్కీగా దక్కిన ‘వారణాసి’?
రాజమౌళి డైరెక్షన్‌లో డైసీ నటించాల్సి రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో రాజమౌళి రూపొందించిన గ్లోబల్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘RRR’ లో జూనియర్ ఎన్టీఆర్ (కొమరం భీమ్) కు జోడీగా ‘జెన్నీ’ పాత్ర కోసం ముందుగా ఈమెనే ఎంపిక చేశారు. అయితే ఆ సమయంలో డేట్ల సర్దుబాటు కాకపోవడం వల్ల ఆమె ఆ అవకాశం నుండి తప్పుకోగా, ఆ తర్వాత ఆ పాత్రను ఒలివియా మోరిస్ పోషించారు. ఇప్పుడు మళ్లీ జక్కన్న ప్రాజెక్ట్‌లో ఆమెకు అవకాశం రావడం విశేషం.
అధికారిక ప్రకటనపై ఉత్కంఠ
ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతున్నప్పటికీ, దీనిపై దర్శకుడు రాజమౌళి లేదా నిర్మించే శ్రీ దుర్గా ఆర్ట్స్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నిజంగానే డైసీ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చిందా లేదా అన్నది చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Epaper: epaper.vaartha.com

