Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు

వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు

వార్త 2 months ago

Water Bill Cyber Scam: నగరంలో వాటర్ బోర్డు బిల్లుల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

వాటర్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని భయపెట్టి వినియోగదారులను దోచుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read Also:Mathura Boat Accident : యూపీలో ఘోర పడవ ప్రమాదం.. 10 మంది మృతి

Water Bill Cyber Scam: ప్రమాదకరమైన ‘ఏపీకే’ ఫైల్స్

నేరగాళ్లు బాధితులకు మెసేజ్ పంపి HMWSSB WATER BILL UPDATE.apk పేరుతో ఉన్న ఒక లింక్‌ను ఇన్‌స్టాల్ చేయమని కోరుతున్నారని సీపీ పేర్కొన్నారు. ఈ ఏపీకే ఫైల్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే, ఫోన్ నియంత్రణ పూర్తిగా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని హెచ్చరించారు. దీనివల్ల బాధితుల బ్యాంక్ ఖాతాల వివరాలు, ఓటీపీలు నేరగాళ్లకు తెలిసిపోయి డబ్బులు మాయమవుతున్నాయని తెలిపారు.

అపరిచిత లింక్‌లను క్లిక్ చేయవద్దు

ప్రజలు ఇలాంటి బెదిరింపులకు భయపడకుండా జాగ్రత్త వహించాలని సీపీ సజ్జనార్ కోరారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైళ్లను, సాఫ్ట్‌వేర్ లింక్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇన్‌స్టాల్ చేయవద్దని సూచించారు. వాటర్ బిల్లు చెల్లింపుల కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

10 మంది మృతి, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha