Meta New Rules: వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి మెటా కీలక మార్పు తీసుకురానుంది. ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న కస్టమర్ సర్వీస్ మెసేజింగ్‌కు ఇకపై ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
అంటే.. కస్టమర్లకు సమాధానాలు ఇచ్చేందుకు కంపెనీలు పంపే ప్రతి సర్వీస్ మెసేజ్‌కు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
వాట్సాప్ బిజినెస్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ కమ్యూనికేషన్ కేటగిరీలోని మెసేజ్‌లను ఉచితంగానే పంపుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్‌ను నిర్వహిస్తున్న పెద్ద సంస్థలపై ఈ మార్పు అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు కస్టమర్ నుంచి మెసేజ్ వచ్చిన తర్వాత 24 గంటల పాటు ఉండే 'సర్వీస్ విండో'లో కంపెనీలు ఉచితంగా రిప్లై ఇచ్చే అవకాశం ఉండేది. ఇకపై ఆ విధానంలో మార్పులు రానున్నాయి.
Read Also : Jawa Yezdi: పండగ వేళ వాహన దారులకు గొప్ప శుభవార్త తెలిపిన జావా
Charges for WhatsApp Business services… New rules from October 1st.
Meta New Rules: ఇండియాలో ఒక్కో మెసేజ్‌కు 11.5 పైసలు
అక్టోబర్ 1 నుంచి కొత్త ఛార్జీల విధానం అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా ఇండియాలో వాట్సాప్ బిజినెస్ ద్వారా పంపే ఒక్కో సర్వీస్ మెసేజ్‌కు సుమారు 11.5 పైసలు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉచితంగా అందించిన యూటిలిటీ టెంప్లేట్ మెసేజ్‌లకు కూడా ఇకపై ఛార్జీలు వర్తించనున్నాయి. 24 గంటల సర్వీస్ విండోలో మెసేజ్ పంపినా బిల్లింగ్ తప్పదని మెటా తెలిపింది.
అయితే వ్యాపారాలపై ఒక్కసారిగా అదనపు భారం పడకుండా ప్రతి బిజినెస్ ఫోన్ నంబర్‌కు నెలకు 1,000 సర్వీస్ మెసేజ్‌లను ఉచితంగా అందించనున్నారు. ఈ ఉచిత పరిమితి పూర్తైన తర్వాత పంపే ప్రతి మెసేజ్‌కు విడిగా ఛార్జీ విధిస్తారు.
సాధారణ వాట్సాప్ యూజర్లకు ఎలాంటి ప్రభావం లేదు
ఈ కొత్త ఛార్జీలు సాధారణ వాట్సాప్ వినియోగదారులకు వర్తించవు. ముఖ్యంగా పెయిడ్ వాట్సాప్ బిజినెస్ APIని ఉపయోగించే పెద్ద కంపెనీలు, భారీ స్థాయిలో ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్ అందించే సంస్థలకే ఈ నిబంధనలు వర్తిస్తాయి. చిన్న వ్యాపారులు ఉచితంగా ఉపయోగించే వాట్సాప్ బిజినెస్ యాప్‌కు మాత్రం ఈ మార్పులతో సంబంధం ఉండదు.
ఆటోమేటెడ్ స్పామ్ మెసేజింగ్‌ను తగ్గించడంతో పాటు AI ఆధారిత ఆటోమేటెడ్ కమ్యూనికేషన్ ఛానెళ్లను క్రమబద్ధీకరించడంలో భాగంగానే ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు మెటా వెల్లడించింది. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా వంటి మరికొన్ని దేశాల్లోనూ ఈ కొత్త ఛార్జీల విధానం అమలు కానుంది.

