Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు

వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు

వార్త 3 weeks ago

Whatsapp New Feature : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన వినియోగదారుల భద్రత, సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.

ఇందులో ప్రధానంగా కాంటాక్ట్ లిస్ట్‌లో లేని (అన్నోన్) నంబర్ల నుంచి వచ్చే కాల్స్ వివరాలను ముందుగానే తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఏదైనా తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు, అది విదేశీ నంబరా లేక మీరు సభ్యులుగా ఉన్న ఉమ్మడి వాట్సాప్ గ్రూపుల ద్వారా వచ్చిందా అనే వివరాలు నేరుగా స్క్రీన్‌పైనే స్పష్టంగా కనిపిస్తాయి. దీనివల్ల ఫ్రాడ్ కాల్స్, సైబర్ మోసాల బారిన పడకుండా వినియోగదారులు ముందే అప్రమత్తమయ్యే వెసులుబాటు కలుగుతుంది.

ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్స్, పాస్‌కీలతో మెరుగైన సెక్యూరిటీ

సెక్యూరిటీ విభాగంలోనూ వాట్సాప్ విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న టూ-స్టెప్ వెరిఫికేషన్ (Two-Step Verification) 6-డిజిట్ పిన్ స్థానంలో, ఇకపై అక్షరాలు, సంఖ్యల కలయికతో కూడిన 'ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్‌' (Alphanumeric Password)ను సెట్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తోంది. దీనితో పాటు ఖాతా భద్రతను మరింత కంటికి రెప్పలా కాపాడేందుకు ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ, స్క్రీన్ లాక్ వంటి మరిన్ని 'పాస్‌కీల'ను (Passkeys) యాడ్ చేసుకునే అవకాశాన్ని పరిచయం చేసింది.

రూ. 1.5 లక్షల ధరతో ఐఫోన్ 18 ప్రో? లీకైన మైండ్ బ్లావింగ్ ఫీచర్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha