అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు పారదర్శకమైన, మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు లేదా మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగే పనిలేకుండా నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారా వాట్సాప్ లోనే పౌర సేవలు పొందే అవకాశాన్ని కల్పించింది. ఐటీ మరియు డిజిటల్ మీడియా మంత్రి శ్రీధర్ బాబు మార్గదర్శకాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కు సంబంధించిన 9 ముఖ్యమైన సేవలను వాట్సాప్ మీసేవ చాట్‌బాట్ పరిధిలోకి తెచ్చినట్లు ఎలక్ట్రానిక్స్ సర్వీస్ డెలివరీ సంస్థ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
GHMC Launches WhatsApp
వాట్సాప్ ద్వారా లభించే జీహెచ్ఎంసీ కొత్త సేవలు ఇవే
గతేడాది నవంబరులో ప్రారంభమైన మీసేవ వాట్సాప్ చాట్‌బాట్ సర్వీసులకు ఇప్పుడు సరికొత్తగా జీహెచ్ఎంసీ సేవలను కూడా అనుసంధానించారు. దీని ద్వారా కింద పేర్కొన్న పనులను మీసేవ కేంద్రాలకు వెళ్లకుండానే పూర్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సేవలతో పాటు జనన, ఆదాయ ధ్రువపత్రాలు, ట్రాఫిక్ చలానాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపుల వంటి సేవలను కూడా ప్రజలు వాట్సాప్ ద్వారానే ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ సరికొత్త విధానం ద్వారా దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ ఏ దశలో ఉందనే (Application Status) సమాచారాన్ని, తాజా అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు వాట్సాప్ సందేశాల రూపంలో తెలుసుకోవచ్చు. ఒకసారి సంబంధిత సర్టిఫికెట్ లేదా డాక్యుమెంట్ ప్రభుత్వ అధికారుల చేత ఆమోదం పొందగానే, దానిని డౌన్‌లోడ్ చేసుకునే డైరెక్ట్ లింక్ నేరుగా వినియోగదారుడి వాట్సాప్ నంబర్‌కే వస్తుంది. దీనివల్ల పదే పదే మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయం, శ్రమ ఆదా అవుతాయి.
GHMC Launches WhatsApp: మధ్యవర్తుల పాత్రకు చెక్ – పెరిగిన పారదర్శకత
వాట్సాప్ మీసేవ సర్వీసుల వల్ల పౌర సేవల్లో పారదర్శకత పెరిగిందని, మధ్యవర్తుల పాత్ర పూర్తిగా తొలాగిపోయిందని అధికారులు వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 5 వేలకు పైగా మీసేవ కేంద్రాల ద్వారా నిత్యం 80 వేల నుంచి లక్ష మందికి డిజిటల్ సేవలు అందుతున్నాయి. రికార్డు స్థాయిలో 2023 నవంబరు 1 నుంచి 2026 జనవరి 31 వరకు దాదాపు 5.98 కోట్ల లావాదేవీలు (రూ.3,811 కోట్ల విలువైనవి) నమోదయ్యాయి. త్వరలోనే అత్యవసర సేవల (Emergency Services) నంబర్లను కూడా ఈ వాట్సాప్ మీసేవ ప్లాట్‌ఫారమ్‌కు అనుసంధానం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

