Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వాయిదాలకే సరిపోతున్న పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్.. రూ.216 కోట్లు వృథా

వాయిదాలకే సరిపోతున్న పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్.. రూ.216 కోట్లు వృథా

వార్త 1 week ago

Parliament Session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చల కంటే వాయిదాలు, ప్రతిపక్షాల నిరసనలకే పరిమితమవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

వివిధ ప్రజా సమస్యలు మరియు వివాదాస్పద అంశాలపై విపక్షాలు చేపట్టిన వరుస ఆందోళనలతో ఎలాంటి సార్థక చర్చలు లేకుండానే దాదాపు 18 రోజుల సమయం ముగిసిపోయింది. ఈ సమావేశాల కాలంలో ఇప్పటివరకు సభకు చెందిన సుమారు 79.3 గంటల విలువైన సమయం వృథా అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పార్లమెంట్ నిర్వహణకు గంటకు సగటున రూ. 1.5 కోట్లు ఖర్చవుతుండగా, సభలు నిరంతరం వాయిదా పడటం వల్ల పన్ను చెల్లింపుదారులకు చెందిన దాదాపు రూ. 216 కోట్ల ప్రజాధనం నీటిపాలైందని ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హంగామా మధ్యే 19 బిల్లుల ఆమోదం - JPC కి కీలక FCRA సవరణ బిల్లు

ఉభయ సభల్లో విపక్షాల నిరసనలు, నినాదాల హోరు కొనసాగుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తన ప్రణాళికాబద్ధమైన శాసన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది. ప్రతిపక్షాల భాగస్వామ్యం లేకుండానే ప్రభుత్వం ఈ సెషన్‌లో సభామోదం పొందేలా 19 కీలక బిల్లులను ఆమోదింపజేసుకుంది. ఇదే సమయంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన విదేశీ విరాళాల నియంత్రణ సవరణ (FCRA) బిల్లుపై మరింత సమగ్ర పరిశీలన అవసరమని భావించి, దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపాలని నిర్ణయించింది. ప్రజల నిధులతో నడిచే పార్లమెంట్ సమయం చర్చలు లేకుండా ముగిసిపోవడం ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆందోళనకరమైన విషయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

రష్యా-ఉక్రెయిన్ వివాదంలోకి మాజీ సీజేఐ చంద్రచూడ్.. కీలక బాధ్యతలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha