Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వాయుగుండం ఎఫెక్ట్ 17 జిల్లాలకు రెడ్ అలర్ట్

వాయుగుండం ఎఫెక్ట్ 17 జిల్లాలకు రెడ్ అలర్ట్

వార్త 1 week ago

Heavy Rain in Telangana : తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రాబోయే 24 నుండి 48 గంటల్లో రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ముఖ్యంగా పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట సహా మొత్తం 17 జిల్లాలకు అధికారులు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని, వాగులు, వంకలు పొంగిపొర్లే సూచనలు ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు మరియు ముందస్తు జాగ్రత్తలు

మరోవైపు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉండటంతో స్థానిక యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని, విద్యుత్ స్తంభాలు, పొంగిపొర్లుతున్న వాగుల వద్దకు వెళ్లకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులకు, వాహనదారులకు కూడా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.

కొత్త పింఛన్లపై సర్కార్ కీలక నిర్ణయం.. అక్టోబర్ నుంచే పంపిణీ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha