10మంది మాజీ క్రికెటర్లతో సెలెక్షన్ కమిటీ
Telangana Premier League: తెలంగాణ యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) మ్యాచ్లను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అంబటి రాయుడు తెలిపారు.
ఈమేరకు సోమవారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి, ఆపరేషన్స్ హెడ్ సీఈఓ ఇంతియాజ్ అలీ కలిసి హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించి ప్రెస్మిట్లో లీగ్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Read Also: PBKS vs DC Result: పంజాబ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
Telangana Premier League (TPL) next month
Telangana Premier League: రాష్ట్రవ్యాప్తంగా 3వేల మంది ఆటగాళ్ల ఎంపిక
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెలలో నిర్వహించనున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి ఎంపిక చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. యువ ఆటగాళ్లకు సరైన వేదిక కల్పించడం ద్వారా భవిష్య త్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
హెచ్సీఏ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ ప్రభావం లేకుండా పూర్తిగా పారదర్శక విధానంలో పది మంది మాజీ క్రికెటర్లతో సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆటగాళ్ల ఎంపికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.
నిష్పక్షపాత నిర్ణయాలు
దీని ద్వారా నిజమైన ప్రతిభ కలిగిన ఆటగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి ఎంపిక ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని, సెలెక్షన్కు సంబంధించిన ఫిజికల్ రికార్డులను కూడా సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంలో ఐపీఎల్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్న అంబటి రాయుడు, అదే తరహాలో హెచ్. సీఏ ఆధ్వర్యంలో కూడా పారదర్శకంగా లీగ్లు నిర్వహిస్తామని తెలిపారు. ఓపెన్ ట్రయల్స్, లీగ్ మ్యాచ్ ల నిర్వహణను మరింత విసృతంగా చేపడుతు న్నా మని, ప్రతి నిర్ణయం నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకుంటు న్నామని స్పష్టం చేశారు. రాబోయే లీగ్లకు సంబంధించిన తుది నిర్ణయా లను సెలెక్షన్ కమిటీ తీసుకుంటుందని, ఆటగాళ్లు, అంపైర్ల నియామక ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభించామని నిర్వాహకులు వెల్లడించారు.
సెలక్షన్ కమిటీ..
సీనియర్స్ సెలక్షన్ కమిటీకి పి. అక్శాంత్ రెడ్డి చైర్మన్ టి.సుమన్, మెహది హసన్, టి.పవన్ కుమార్, ఇందర్శేఖర్రెడ్డి సభ్యులుగా వ్యవహరిం చనున్నారు. అలాగే జూనియర్స్ సెలక్షన్స్ కమిటీకి అకాశ్ బండారి చైర్మన్గా పి.రమేష్ కుమార్, షోయబ్, సర్వేష్కుమార్, టీ మోతి కుమార్ సభ్యులుగా వ్యవహరించనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

