Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రైవేట్ కంపెనీలను తరిమేస్తాం: జగన్ ధీమా

వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రైవేట్ కంపెనీలను తరిమేస్తాం: జగన్ ధీమా

వార్త 2 months ago

YS Jagan Promises: జువ్వలదిన్నె ప్రాంతంలో దాదాపు 41 వేల టన్నుల మత్స్య సంపద లభ్యమవుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికి అక్కడ 1250 బోట్లు ఉండేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసేలా ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నారని, ఇది మత్స్యకారుల అభివృద్ధికి ఆటంకమని ఆయన అభిప్రాయపడ్డారు.

Read also: Nellore News: జువ్వలదిన్నె హార్బర్‌లో జగన్ పర్యటన

YS Jagan speech at Juwwaladinne port

YS Jagan Promises: ప్రైవేట్ కంపెనీల కుట్రలను అడ్డుకుంటాం

సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలకు భూములు కేటాయిస్తూ మత్స్యకారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని జగన్ ఆరోపించారు. జువ్వలదిన్నె నుంచి తరిమేసేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. మత్స్యకారుల పొట్ట కొట్టి కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చడం సరైన పద్ధతి కాదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

మత్స్యకారుల సొంతం కానున్న ఫిషింగ్ హార్బర్లు

వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని అక్కడి నుంచి తరలిస్తామని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న 10 ఫిషింగ్ హార్బర్లు అన్నీ పూర్తిస్థాయిలో మత్స్యకారులకే చెందుతాయని ఆయన స్పష్టం చేశారు. మత్స్యకారుల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని జగన్ భరోసా ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కదిరిలో భారీ పేలుడు.. నలుగురు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha