Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ అజిత్ అగార్కర్ ప్రశంసలు

వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ అజిత్ అగార్కర్ ప్రశంసలు

వార్త 1 week ago

Vaibhav Suryavanshi: భారత క్రికెట్‌లో ఓ యువ సంచలనం సరికొత్త రికార్డును లిఖించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ, ఏకంగా భారత సీనియర్ పురుషుల జట్టులో చోటు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం తాజాగా ప్రకటించిన భారత టీ20 జట్లలో వైభవ్‌కు స్థానం లభించింది. దీంతో భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ ఆల్-టైమ్ రికార్డు సృష్టించాడు.

Read Also : IND vs AFG Test Score:లంచ్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే?

 BCCI’s Ajit Agarkar praises Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో విధ్వంసం.. ఒంటిచేత్తో గెలిపించిన నైజం

ఈ అద్భుతమైన సంచలనంపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక యువ క్రికెటర్‌గా వైభవ్ అసాధారణ ప్రతిభను కనబరుస్తున్నాడని కొనియాడాడు. టీమ్ ఎంపిక అనంతరం అగార్కర్ మాట్లాడుతూ.. “ఒక యువ ఆటగాడి గురించి ఏం చెప్పగలం? అతడు ఏం చేయగలడో మీరంతా ఇప్పటికే చూశారు. ఐపీఎల్ (IPL) ప్లేఆఫ్స్‌లో కూడా దాదాపు ఒంటిచేత్తో రాజస్థాన్ రాయల్స్ జట్టును ముందుకు నడిపించాడు. అతని బ్యాటింగ్ సామర్థ్యం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు” అని పేర్కొన్నాడు.

ప్రదర్శనతోనే జట్టులోకి.. అగార్కర్ ప్రశంసలు

వైభవ్ సూర్యవంశీ కేవలం ఈ సీజన్‌లోనే కాకుండా, గత సీజన్‌లోనూ అద్భుతంగా రాణించాడని అజిత్ అగార్కర్ గుర్తుచేశాడు. ఐపీఎల్ లాంటి అత్యంత పోటీ, తీవ్రమైన ఒత్తిడి ఉండే టోర్నమెంట్‌లో అతడు ఎంతో విధ్వంసకరంగా మారి, మ్యాచ్ విన్నర్‌గా అవతరించాడని కొనియాడాడు. “క్రికెట్‌ను, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌ను ఫాలో అయ్యేవారికి అతనిపై భారీ అంచనాలున్నాయి. వాస్తవానికి అతడు కేవలం వయసుతో సంబంధం లేకుండా, తన అద్భుతమైన ప్రదర్శనతోనే భారత జట్టులో అర్హత సాధించి చోటు దక్కించుకున్నాడు” అని సెలక్టర్ స్పష్టం చేశాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha