Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే: బీసీ జనార్దన్ రెడ్డి

వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే: బీసీ జనార్దన్ రెడ్డి

వార్త 3 weeks ago

BC Janardhan Reddy : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతోందని ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

రాష్ట్రంలో అలజడి సృష్టించి శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రేరేపణలకు లోనుకావద్దని సూచించారు.

వైఎస్సార్ విగ్రహం ఘటనపై వ్యాఖ్యలు

ఉమ్మడి కర్నూలు జిల్లా ముదిగేడులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్త జంబులయ్యేనని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించి అతని కుటుంబ సభ్యులు విడుదల చేసిన వీడియోలో తాము వైసీపీ మద్దతుదారులమని పేర్కొన్నారని తెలిపారు. మంత్రి వివరాల ప్రకారం, జంబులయ్య భార్య విడుదల చేసిన వీడియోలో స్థానిక వైసీపీ కార్పొరేటర్ సహాయంతో ఉద్యోగం లభించిందని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఘటనలో ఇతర రాజకీయ పార్టీలను ఇరికించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.

Read Also : ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా..?:మంత్రి !

 BC Janardhan Reddy

స్థానిక ఎన్నికలపై రాజకీయ వేడి

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అలాగే ఫ్యాక్షన్ రాజకీయాలను అరికట్టడంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ప్రజలు గత ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలని, అభివృద్ధి అంశాలపైనే రాజకీయాలు జరగాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కట్టెల కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మహిళలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha