Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీలో టికెట్ కావాలంటే మత మార్పిడి చేసుకోవాలా ?

వైసీపీలో టికెట్ కావాలంటే మత మార్పిడి చేసుకోవాలా ?

వార్త 1 week ago

YCP : వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో వెలుగుచూసిన గృహహింస ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఆయన కోడలు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం, కేవలం కుటుంబ కలహాలకే పరిమితం కాకుండా అనూహ్యమైన రాజకీయ మలుపు తిరిగింది. జోగి రమేష్ కుటుంబం రహస్యంగా మత మార్పిడి చెందిందంటూ ఆయన కోడలు చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. బయటకు ప్రాచీన హిందూ సంప్రదాయాలు, పండుగలను ఆచరిస్తున్నట్లు కనిపిస్తూనే.. అంతర్గతంగా మతం మారడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రజల్లో ప్రాతినిధ్యం వహించే నాయకులు తమ ఆధ్యాత్మిక నిష్టలను పారదర్శకంగా ఉంచకుండా దాచిపెట్టడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 Jogi ramesh news

వైసీపీలో మత మార్పిడి ఒత్తిళ్లు? పదవుల కోసమే ఈ వ్యూహాత్మక మార్పులా?

గత వైసీపీ పాలనలో పార్టీ అంతర్గతంగా నిశ్శబ్ద మత మార్పిడులు జరిగాయనే ఆరోపణలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూరుస్తోంది. గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలకు సంబంధించిన వార్తలు, ఫోటోలు వైరల్ అయినట్లే.. ఇప్పుడు జోగి రమేష్ ఉదంతం కూడా వైసీపీలో సాగిన విస్తృత ధోరణిలో భాగమేననే అభిప్రాయాలు బలపడుతున్నాయి. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి దగ్గరవ్వడానికి, పదవులు, రాజకీయ ప్రాధాన్యత దక్కించుకోవడానికే నేతలు ఇలా సైలెంట్‌గా మతం మారారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయాలను దాచిపెట్టి, తీరా అధికారం పోయాక ఇవన్నీ వెలుగులోకి రావడం రాజకీయ అవకాశవాదానికి ప్రతీకగా నిలుస్తోందని, ఇంకా ఎంతమంది నాయకులు ఇలాంటి ముసుగులో ఉన్నారోననే చర్చ ఏపీ రాజకీయాల్లో ఊపందుకుంది.

ఏపీ రైతులకు ఖరీఫ్ బీమా బకాయిలు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha