Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వండర్ కిడ్ సూర్యవంశీ విధ్వంసం!

వండర్ కిడ్ సూర్యవంశీ విధ్వంసం!

వార్త 2 weeks ago

Vaibhav Suryavanshi Record: ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్స్ రేసులో భాగంగా న్యూ ఛండీగఢ్ (మొహాలీ) లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు పరుగుల విధ్వంసం సృష్టించారు.

టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ పాట్ కమిన్స్ నిర్ణయాన్ని తలకిందులు చేస్తూ.. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు బోర్డుపై ఉంచింది.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అరుదైన ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్‌ను టార్గెట్ చేసిన వైభవ్.. అతడు వేసిన ఒకే ఓవర్‌లో ఏకంగా 25 పరుగులు పిండుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే 334.48 స్ట్రైక్ రేట్‌తో 12 సిక్సర్లు, 5 ఫోర్ల సహాయంతో 97 పరుగులు సాధించి ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తృటిలో (కేవలం 3 పరుగుల తేడాతో) చారిత్రాత్మక సెంచరీని చేజార్చుకున్నాడు.

ఈ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా వైభవ్ సూర్యవంశీ నెలకొల్పిన రికార్డులు ఇవే: 2012 ఐపీఎల్ సీజన్ లో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ నెలకొల్పిన అత్యధిక సిక్సర్ల (59 సిక్సులు) ఆల్‌టైమ్ రికార్డును వైభవ్ అధిగమించాడు. ఈ సీజన్‌లో వైభవ్ ఇప్పటికే 65 సిక్సర్లు బాది సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో 600 పరుగుల మైలురాయిని దాటిన అత్యంత పిన్న వయస్కుడిగా (తొలి టీనేజర్) రిషబ్ పంత్, పృథ్వీ షా ల రికార్డులను వైభవ్ బ్రేక్ చేశాడు. గతంలో దేవదత్ పడిక్కల్ (580 పరుగులు) పేరిట ఉన్న టీనేజ్ రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది.

    ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ మెరుపులు..

    వైభవ్ సూర్యవంశీ అవుటైన తర్వాత కూడా రాజస్థాన్ పరుగుల వేగం తగ్గలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తనదైన శైలిలో విరుచుకుపడుతూ కేవలం 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (29), కెప్టెన్ రియాన్ పరాగ్ (26) రాణించగా, ఆఖర్లో రవీంద్ర జడేజా 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.

    Vaibhav Suryavanshi Record:తేలిపోయిన హైదరాబాద్ బౌలింగ్.. కమిన్స్ వూచకోత!

    సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ పాట్ కమిన్స్ తన 4 ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. సకీబ్ హుసైన్ కూడా 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చాడు. ప్రఫుల్ హింగే 54 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టినప్పటికీ పరుగుల వరదను ఆపలేకపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి (2 ఓవర్లలో 12 పరుగులు, 1 వికెట్) ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు

    బ్యాటర్అవుట్ అయిన విధానంపరుగులుబంతులుఫోర్లుసిక్సర్లుస్ట్రైక్ రేట్
    యశస్వి జైస్వాల్సి అభిషేక్ శర్మ బి శివాంగ్ కుమార్29
    వైభవ్ సూర్యవంశీసి రవిచంద్రన్ బి ప్రఫుల్ హింజే9729512334.48
    ధృవ్ జురెల్సి నితీశ్ రెడ్డి బి ప్రఫుల్ హింజే502153238.09
    రియాన్ పరాగ్ (C)సి క్లాసెన్ బి ప్రఫుల్ హింజే26
    డొనవన్ ఫెర్రీరారనౌట్ (శివాంగ్ / ఇషాన్ కిషన్)12
    దసున్ శనకసి అభిషేక్ శర్మ బి ఈషన్ మలింగ5
    రవీంద్ర జడేజానాటౌట్12
    జోఫ్రా ఆర్చర్సి అభిషేక్ బి నితీశ్ కుమార్ రెడ్డి4
    నాండ్రే బర్గర్రనౌట్ (ఈషన్ మలింగ / ఇషాన్)1
    సుశాంత్ మిశ్రానాటౌట్1
    ఎక్స్‌ట్రాలు(వైడ్స్, నో-బాల్స్ మొ..)06
    మొత్తం స్కోరు(20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి)243
    బౌలర్ఓవర్లుమేడెన్లుపరుగులువికెట్లుఎకానమీ
    పాట్ కమిన్స్4.0064016.00
    ఈషన్ మలింగ4.0040110.00
    సకీబ్ హుసైన్4.0052013.00
    ప్రఫుల్ హింజే4.0054313.50
    శివాంగ్ కుమార్2.001919.50
    నితీష్ కుమార్ రెడ్డి2.001216.00

    Read Also hindi news: hindi.vaartha.com

    Read Also Epaper : epaper.vaartha.com

    Read also:

    బుడ్డోడి ఎఫెక్ట్..హైదరాబాద్‌పై 47 పరుగులతో ఘనవిజయం!

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha