Dailyhunt
వందే భారత్ లో నాసిరకం భోజనం.. రూ. 10 లక్షల జరిమానా!

వందే భారత్ లో నాసిరకం భోజనం.. రూ. 10 లక్షల జరిమానా!

వార్త 3 weeks ago

Poor Food Quality Fine IRCTC: మార్చి 15న పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు నాసిరకం భోజనం వడ్డించిన ఉదంతంపై రైల్వే శాఖ అత్యంత కఠినంగా స్పందించింది.

ఆహార నాణ్యతలో రాజీ పడినందుకు గాను ఐఆర్‌సీటీసీ (IRCTC)కి రూ. 10 లక్షల భారీ జరిమానా విధించింది. దీనితో పాటు, సదరు రైలులో భోజన వసతి కల్పిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Read Also: Mohanlal-Delhi HC: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మోహన్ లాల్.. కారణమిదే!

 Poor food in Vande Bharat.. Rs. 10 lakh fine!

Poor Food Quality Fine IRCTC: ప్రయాణికుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత

ఈ ఘటనపై రైల్వే ప్రతినిధి స్పందిస్తూ.. రైలు ప్రయాణికుల భద్రత, వారికి అందించే ఆహార నాణ్యతే తమ ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో ఎటువంటి అలసత్వాన్ని సహించబోమని హెచ్చరించారు. ప్రయాణికులు ఫిర్యాదు చేసిన వెంటనే విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మూడేళ్లలో రూ. 2.6 కోట్ల జరిమానాలు

ఆహార నాణ్యతపై రైల్వే శాఖ నిరంతరం నిఘా ఉంచుతోంది. గత మూడేళ్ల కాలంలో ఇలాంటి వివిధ ఫిర్యాదులపై విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై సుమారు రూ. 2.6 కోట్ల వరకు జరిమానాలు విధించినట్లు అధికారులు వెల్లడించారు. రైళ్లలో క్యాటరింగ్ సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు నిరంతర తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha