Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. ఒకే గ్రూప్‌లో భారత్‌-పాక్‌

వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. ఒకే గ్రూప్‌లో భారత్‌-పాక్‌

వార్త 3 weeks ago

Odi world cup 2027 schedule: అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పురుషుల వన్డే ప్రపంచకప్‌-2027 పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ విడుదల చేసింది.

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలగా జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 2న సూపర్ సిరీస్‌తో ప్రారంభమై నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. ఈ 50 ఓవర్ల ప్రపంచకప్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి.

ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో అఫ్గానిస్తాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌, పాకిస్తాన్‌, జింబాబ్వే, క్వాలిఫయర్‌-ఎ ఉండగా.. గ్రూపు-బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, క్వాలిఫయర్‌-బి జట్లు ఉన్నాయి.

భారత్ మ్యాచ్‌ల వివరాలు
ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్‌ 7 కేప్‌టౌన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. అనంతరం అక్టోబర్‌ 10న జోహాన్స్‌బర్గ్‌ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.

ఆ తర్వాత అనంతరం అక్టోబర్ 14న అఫ్గానిస్తాన్, అక్టోబర్ 17న క్వాలిఫయర్-ఎ జట్టుతో, అక్టోబర్ 24న జింబాబ్వేతో గ్రూప్ దశ మ్యాచ్‌లను ఆడనుంది. 2023 ప్రపంచకప్‌లో తుది మొట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని కసితో ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also : Ishan Kishan: భారత్ తరఫున ఆడటం ప్రత్యేక అనుభూతి..ఇషాన్ కిషన్‌ ఎమోషనల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha