Shashank Singh cook controversy: పంజాబ్ కింగ్స్, స్టార్ క్రికెటర్ శశాంక్ సింగ్ చుట్టూ ముసురుకున్న లీగల్ వివాదంపై ఆయన ఎట్టకేలకు స్పందించారు. తన మాజీ కుక్ తనపై, కుటుంబంపై చేసిన భౌతిక దాడి, అక్రమ నిర్బంధం ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
భోపాల్‌లో తనపైనా, తన తండ్రిపైనా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైన మరుసటి రోజే శశాంక్ ఈ విషయాలపై బహిరంగ ప్రకటన చేశారు.
ఈ వివాదంపై క్రికెటర్ శశాంక్ సింగ్ మాట్లాడుతూ, అసలు సదరు వంటమనిషిని ఉద్యోగం నుంచి ఎందుకు తీసేయాల్సి వచ్చిందో వివరించారు. ఆ ఉద్యోగి తమ ఇంట్లో పనిచేస్తున్న సమయంలో కనీస మర్యాదలు పాటించలేదని ఆరోపించారు. తమ అనుమతి లేకుండా, కుటుంబ సభ్యుల నివాసంలోని అత్యంత వ్యక్తిగత ప్రాంతాల్లోకి (ప్రైవేట్ రూమ్స్) చొరబడి వీడియోలు రికార్డ్ చేశాడని, ఈ నిఘా ఉల్లంఘన వల్లే అతనిని వెంటనే ఉద్యోగం నుండి తొలగించాల్సి వచ్చిందని శశాంక్ స్పష్టం చేశారు.
Read Also : FIFA World Cup 2026: నెంబర్ 1 స్థానంలో జర్మనీ ఆటగాడు.. మెస్సీ, ఎంబాపెలకు తప్పని నిరాశ!
Shashank Singh cook controversy: బెడ్‌రూమ్‌లో రహస్యంగా వీడియోల రికార్డింగ్!
Shashank Singh breaks silence on cook’s assault allegations.
Shashank Singh cook controversy: భోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు
శశాంక్ సింగ్ కుటుంబానికి చెందిన మాజీ వంటమనిషి విపేంద్ర సింగ్ తోమర్ భోపాల్‌లోని రతిబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శశాంక్ సింగ్, అలాగే ఆయన తండ్రి (మాజీ ఐపీఎస్ అధికారి) శైలేష్ సింగ్ తనపై భౌతిక దాడికి దిగారని, దూషించడమే కాకుండా బలవంతంగా గదిలో నిర్బంధించారంటూ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శశాంక్, ఆయన తండ్రిపై కేసు నమోదు చేశారు.
తమ కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు మరియు ఉద్యోగం నుంచి తీసేసిన కక్షతోనే సదరు వంటమనిషి ఈ విధమైన అక్రమ ఆరోపణలు చేస్తున్నాడని శశాంక్ సింగ్ మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఒక మాజీ ఐపీఎస్ అధికారి కుటుంబంపై ఇలాంటి నిందలు వేయడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని, ఈ కేసును తాము చట్టపరంగానే ఎదుర్కొంటామని క్రికెటర్ వర్గాలు స్పష్టం చేశాయి.
నెదర్లాండ్స్‌కు మొరాకో షాక్.. షూటౌట్‌లో గెలిచి ప్రి క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన ఆఫ్రికన్ లయన్స్!

