Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరవరరావు పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎన్ఐఏకు నోటీసులు జారీ!

వరవరరావు పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎన్ఐఏకు నోటీసులు జారీ!

వార్త 1 day ago

Varavara Rao: భీమా కోరేగావ్-ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ విప్లవ కవి, 85 ఏళ్ల పి. వరవరరావు దాఖలు చేసిన తాజా పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.

తాను ముంబై వదిలి హైదరాబాద్‌లో నివసించేందుకు అనుమతించాలన్న ఆయన అభ్యర్థనపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

 Mumbai Living Cost

ముంబైలో బతుకు భారం: కోర్టుకు వరవరరావు వివరణ

జస్టిస్ అజయ్ గడ్కరీ, జస్టిస్ కమల్ ఖాతాలతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. వృద్ధాప్యంలో ఉన్న తనకు ముంబై వంటి మహానగరంలో నివసించడం ఆర్థికంగా పెనుభారంగా మారిందని వరవరరావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు వచ్చే నెలవారీ పెన్షన్ సుమారు రూ. 50,000 మాత్రమేనని, కానీ ముంబైలో కనీస జీవన వ్యయం రూ. 77,000 దాటుతోందని, ఈ అదనపు ఖర్చులను తాను భరించలేకపోతున్నానని ఆయన కోర్టుకు వివరించారు.

Read also: Fake bomb calls to airports : విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!

Varavara Rao: హైకోర్టును ఆశ్రయించడానికి కారణం

భీమా కోరేగావ్ కేసులో కోర్టు అనుమతి లేకుండా గ్రేటర్ ముంబై సరిహద్దులు దాటకూడదనే కఠినమైన షరతుపై వరవరరావు ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్నారు. ఇదే విషయమై ఆయన గతంలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది మార్చి 16న ఆ పిటిషన్ తిరస్కరణకు గురైంది. సుప్రీంకోర్టు విధించిన బెయిల్ నిబంధనలను మార్చే అధికారం తమకు లేదని ప్రత్యేక కోర్టు స్పష్టం చేయడంతో, ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

కేసు నేపథ్యం

2018 ఆగస్టులో అరెస్టయిన వరవరరావు, వృద్ధాప్య సమస్యలతో జైల్లో అనారోగ్యానికి గురయ్యారు. దాంతో 2021లో బాంబే హైకోర్టు ఆయనకు తాత్కాలిక ఉపశమనం అందించగా, 2022లో సుప్రీంకోర్టు వైద్య కారణాల రీత్యా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ పిటిషన్‌పై ఎన్ఐఏ తన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

నీట్​ రీ-ఎగ్జామ్‌లో రఫ్‌ వర్క్‌ పేజీలు రెట్టింపు తో పాటు పరీక్ష సమయాన్ని పెంపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha